Operation Sindoor: దేశాల మధ్య జరిగే యుద్ధాలు కూడా పై ఉపోద్ఘాతానికి అచ్చంగా సరిపోతాయి. యుద్ధాలు శాంతిస్థాపన కోసం జరుగుతాయనడం నిజంగా అవివేకం. వాస్తవానికి శాంతి జరగాలంటే సమయమనం ఉండాలి.. సంయోచితం ఉండాలి. సాటి మనుషులు అనే భావన ఉండాలి. అప్పుడే కదా రణతంత్రం జరగదు. కుతంత్రానికి తాగుండదు. కుటిల తత్వానికి చోటు ఉండదు. కానీ నేటి కాలంలో ఇవన్నీ జరగకుండా ఉంటున్నాయా.. బలమైన దేశాలు మరింత బలం సంపాదించుకుంటున్నాయి. బలంగా ఎదగాలి అనుకుంటున్న దేశాలు.. బలోపేతం అవుతున్నాయి. కానీ ఈ ప్రక్రియలో బలహీనమైన దేశాలు మరింత శక్తిని కోల్పోతున్నాయి. ఆవులు ఆవులు కొట్టుకుంటే మధ్యలో దూడల కాళ్ళు మాత్రమే విరుగుతాయి. నవీన కాలంలో జరుగుతున్న యుద్ధాలకు పై సామెత నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది.
Also Read: సాగరనగరం పై నిఘా.. పోలీసుల జల్లెడ!
ఎంత పెద్ద యుద్ధమైనా సరే.. ఎంతటి బలవంతమైన దేశాల మధ్య జరిగిన సరే ఎక్కడో ఒకచోట దానికి ఫుల్ స్టాప్ పడాలి. యుద్ధం ముగిసినప్పుడు చాలావరకు పర్యావరణం ప్రభావితం అవుతుంది. కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతుంది. శిధిలాలు, శకలాలతో భూమి ఒక పాడుబడ్డ దిబ్బలాగా కనిపిస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాదు.. యుద్ధం పూర్తయిన తర్వాత మనుషుల శరీరాలలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయట. భారీ యుద్ధాలు ముగిసిన తర్వాత ఆడపిల్లల కంటే మగపిల్లలే ఎక్కువగా పుడుతుంటారట. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ ప్రపంచం ఇప్పటివరకు రెండుసార్లు యుద్దాలను చవిచూసింది. రెండు ప్రపంచ యుద్ధ సమయంలోనూ ఎక్కువగా మగ పిల్లలు పుట్టారు. యుద్దల సమయంలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీనికి “రిటర్నింగ్ సోల్జర్ ఎఫెక్ట్” అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. అయితే దీని వెనుక కారణాలు ఏమున్నాయనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేకపోయారు. అయితే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం ముగిసిన తర్వాత.. ఆడపిల్లల కంటే మగపిల్లలే ఎక్కువగా పుడతారా? ఏమో ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం చెబుతున్నారు శాస్త్రవేత్తలు. “యుద్ధం ముగిసిన తర్వాత మనుషుల శరీరాలు తీవ్రమైన మార్పులకు గురవుతాయి. ఆ సమయంలో మనుషుల లింగ నిర్ధారణ అనేది ఏకపక్షంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎక్స్, వై క్రోమోజోమ్ల కలయికతో పుట్టే వారే ఎక్కువగా ఉంటారు. ఎక్స్, వై క్రోమోజోములు కేవలం పురుషుల్లోనే ఉంటాయి కాబట్టి.. పుట్టేవారు మొత్తం మగ పిల్లలే అయి ఉంటారు. గతంలో రెండుసార్లు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలో ఎక్కువగా మగ పిల్లలు మాత్రమే పుట్టారు. దీనికి కొన్ని థియరీలను మేము ప్రతిపాదించాం. అయితే దాని వెనుక ఏం జరిగిందనేది తెలియాల్సి ఉందని” శాస్త్రవేత్తలు అంటున్నారు.