Motorola Edge 80 Ultra 5G: ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో కంటెంట్లు సృష్టించడానికి ఆసక్తి చెబుతున్నారు. ఇలాంటివారు ప్రత్యేకంగా కెమెరాను కొనుగోలు చేయకుండా మంచి కెమెరాలు ఉన్న ప్రత్యేక మొబైల్ కొనుగోలు చేస్తున్నారు. కెమెరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న Motorola కంపెనీ ఇప్పటివరకు ఎన్నో రకాల అద్భుతమైన ఫోన్లను ప్రవేశపెట్టింది. లేటెస్ట్ గా 300MP మెయిన్ కెమెరాతో ఫోన్ ను తీసుకువచ్చింది. ఇందులో కెమెరా మాత్రమే కాకుండా బ్యాటరీ, సాఫ్ట్వేర్ తోపాటు అన్ని రకాల ఫీచర్స్ యూత్ కు అనుగుణంగా ఉన్నాయి. ఈ మొబైల్ ఎలా ఉందంటే?
Motorola కంపెనీ నుంచి లేటెస్ట్గా Edge 80 అల్ట్రా 5G అనే మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. ఇది శక్తివంతమైన కెమెరాతో పాటు ప్రాసెసర్, బ్యాటరీని కలిగి ఉంది. ముందుగా ఈ ఫోన్లో ఉన్న డిస్ప్లే విషయానికి వస్తే.. ఈ మొబైల్ లో 6.82 అంగుళాల QHD AMOLED డిస్ప్లేను కలిగే ఉంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేయడం వల్ల స్మూత్ గా స్క్రోలింగ్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే 2000 నిట్ ల గరిష్ట బ్రైట్నెస్ ఉండడంతో గేమింగ్ కోరుకునే వారికి అనుగుణంగా డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ఫ్రంట్ భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో రక్షణగా ఉంటుంది. ఇది ఐపి 68 రేటింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
ఈ మొబైల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కెమెరా పని తీరు. ఇది 300 MP మెయిన్ కెమెరా తో పనిచేస్తుంది. అతి తక్కువ కాలంలో స్పష్టమైన కావలసిన ఫోటోలను వెంటవెంటనే తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే 50 MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉండడంతో పాటు 16 MP టెలిఫోటో లెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ఈ మొబైల్ లో 64 MP కెమెరాలు కలిగి ఉంది. కేవలం ఫోటోలు మాత్రమే కాకుండా 8K resolution తో వీడియోలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది.
ఈ మొబైల్లో కేవలం కెమెరా మాత్రమే కాకుండా బలమైన బ్యాటరీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 7500 mAh బ్యాటరీ ఉండగా.. దీనికి 180 W సపోర్టుతో ఫాస్టెస్ట్ చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 25 నుంచి 30 నిమిషాల్లోనే పూర్తిగా చార్జింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో బిజీగా ఉండేవారు వెంటనే చార్జింగ్ కావాలని అనుకునే వారికి ఇది పూర్తిగా మద్దతు ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 80 ఆల్ట్రా మొబైల్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ సిరీస్ ప్రాసెసర్ ను చేర్చారు. ఇది మల్టీ టాస్కింగ్ యూస్ చేసేవారికి అనుగుణంగా ఉంటుంది. ఇందులో 12gb రామ్ తో పాటు 256 జీబీ స్టోరేజ్ని ఉంచారు. భారతదేశంలో దీనిని రూ.69,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా దీన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.