https://oktelugu.com/

Motilal Oswal: మరోసారి విరుచుకుపడనున్న టెల్కోలు.. ఈ సారి ఏ మేరకు ఉండబోతోందంటే.. మోతీలాల్ ఓస్వాల్ సంచలన ప్రకటన..

టెలికాం పరిశ్రమ ఆదాయం 2025 రోండో త్రైమాసికంలో (Q2 FY25)లో 8 శాతానికి పెరగనుంది. ఇది ప్రధానంగా సుంకాల పెంపుతో నడపబడుతుంది. టారిఫ్ పూర్తి ప్రభావం అమల్లోకి వచ్చినందున (దీనికి రెండు నుంచి మూడు త్రైమాసికాలు పట్టవచ్చు) టెల్కోలకు ఆదాయ వృద్ధి కొనసాగుతుందని భావిస్తున్నారు.

Written By:
  • Mahi
  • , Updated On : December 28, 2024 / 09:09 PM IST

    Motilal Oswal

    Follow us on

    Motilal Oswal: ఒక వైపు భారత టెలికాం అథారిటీ (ట్రాయ్) రీచార్జిల భారం నుంచి వినియోగదారులను రక్షించాలని ఆదేశాలు జారీ చేస్తుంటే మరో వైపు మోతీలాల్ ఓస్వాల్ లాల్ లాంటి కంపెనీలు మాత్రం ఆసక్తికరమైన విషయాలను వెలువరిస్తున్నాయి. డ్యూయల్ సిమ్ములు, గ్రామీణ ప్రాంతాల వారు డేటా వాడుకోకున్నా కంపెనీలు కంపెనీలు భారం మోపుతున్నాయని, డేటా లేకుండా కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లకు ప్రత్యేక ప్లాన్ తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించింది. భారత టెలికాం ఆపరేటర్లు గత ఐదేళ్లలో మూడు సార్లు టారిఫ్‌ ల పెంపును అమలు చేశారు. ఒకసారి 2019లో, ఆ తర్వాత 2021లో, ఇటీవల జులై, 2024. ఈ మూడు పెంపులు టెలికాం పరిశ్రమ సగటు ఆదాయాన్ని భారీగా పెంచాయి. సెప్టెంబరు 2019లో రూ. 98 ఉన్న సాధారణ రీచార్జి రేటును సెప్టెంబర్ 2024లో రూ. 193కు పెంచారు. దాదాపు తర్వాతి పెంపు 2025 క్యాలెండర్ సంవత్సరం చివరి దశకు ఉండవచ్చని ఓస్వాల్ భావిస్తోంది. IANS నివేదిక ప్రకారం.. ఓస్వాల్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ‘సుంకాల పెంపు మరింత తరచుగా ఉంటాయని మేము భావిస్తున్నాము. డిసెంబర్, 2025లో 15 శాతం వరకు సుంకం పెంపు ఉంటుంది.’ అని చెప్పింది. మరొక పెంపు టెల్కోలు వారి యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్స్ (ARPU) స్థాయిలను పెంచడంలో మంచి రాబడిని చేరుకునే వీలు ఉందని, ఎయిర్‌టెల్‌ను ఖచ్చితంగా రూ. 300 ఏఆర్పీయూ సంఖ్యను మించి చేస్తుంది అని పేర్కొంది.

    2024 రెండో త్రైమాసికంలో 13 శాతం వృద్ధి
    ఓస్వాల్ నివేదిక ప్రకారం.. టెలికాం పరిశ్రమ ఆదాయం 2025 రెండో త్రైమాసికంలో 8 శాతం, 13 శాతం (ఇయర్ ఓవర్ ఇయర్-YOY) ఏడాది మొదటి నుంచి ఏడాది చివరికి రూ. 674 బిలియన్లకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం సుంకాల పెంపు అని తెలుస్తోంది. టారిఫ్ పెంపు పూర్తి ప్రభావం అమల్లోకి వచ్చినందున (దీనికి రెండు నుంచి మూడు త్రైమాసికాలు పట్టవచ్చు) టెల్కోలకు ఆదాయ వృద్ధి కొనసాగుతుందని భావిస్తున్నారు.

    అతిపెద్ద లాభం పొందింది ఈ కంపెనీనే..
    టెల్కోస్‌లో, భారతీ ఎయిర్‌టెల్ టారీఫ్ పెంపుతో అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. టెల్కో ఏఆర్పీయూ ఐదేళ్లలో 2.2 రెట్లు పెరిగింది, 17 శాతం కంపౌండ్ యానువల్ గ్రౌండ్ రేట్ (CAGR) నమోదు చేసింది. వొడాఫోన్ ఐడియా ఖర్చుతో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వృద్ధిని కొనసాగిస్తాయని ఓస్వాల్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, వొడాఫోన్ ఐడియా పెద్ద క్యాపెక్స్ ప్లాన్లను కలిగి ఉందని, ఇతర టెల్కోలకు మార్కెట్ షేర్ లాభాల వేగం మందగించవచ్చు.