Pushpa 3: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ లాంటి నటుడు మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అల్లు అర్జున్ కి చాలా మంచి క్రేజ్ రావడమే కాకుండా పుష్ప సినిమాతో నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన స్టార్ డమ్ మారిపోయింది. ఇక ఒక్కసారిగా తన ఇమేజ్ మొత్తాన్ని మార్చేసుకున్న ఆయన ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడంలో ఆయన ఇప్పటివరకు చాలా ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి. ఇక పుష్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన పుష్ప 2 సినిమాతో పెను రికార్డులను కూడా బద్దలు కొడుతున్నాడు. ఇక పుష్ప 3 సినిమాతో మనల్ని అలరించడానికి తొందర్లోనే మన ముందుకు రాబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే పుష్ప 3 సినిమాలో రజనీకాంత్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కారణం ఏంటి అంటే రజనీకాంత్ ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా మీద మరింత హైప్ వస్తుందని ఉద్దేశ్యంతోనే సుకుమార్ ఇలాంటి ఒక ప్రణాళికను రూపొందించినట్టుగా తెలుస్తుంది.
నిజానికి రజనీకాంత్ ఈ సినిమాలో నటిస్తే ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే పుష్ప ను కంట్రోల్ చేసే క్యారెక్టర్ లో రజినీకాంత్ కనిపించబోతున్నాడట. మరి ఆయన పుష్ప క్యారెక్టర్ ని ఎలా కంట్రోల్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడా? లేదంటే సిండికేట్ లోనే ఒక పవర్ ఫుల్ లీడర్ గా కనిపించబోతున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా పుష్ప లాంటి సినిమాతో అల్లు అర్జున్ తన ఇమేజ్ ను అమాంతం పెంచుకోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీ లో తెలుగు సినిమా స్థాయిని పెంచాడనే చెప్పాలి. ఇక ఈ సంవత్సరంలో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచినట్టుగా వార్తలైతే వస్తున్నాయి…
ఇక మొత్తానికైతే రజనీకాంత్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప 3 రాబోతుందా? ఒకవేళ ఈ న్యూస్ కనక నిజమైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్క్రీన్స్ మొత్తం షేక్ అయిపోవడం ఖాయమంటూ చాలామంది సినీ ప్రముఖులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…