https://oktelugu.com/

Naga Chaitanya : బాహుబలి మేకర్స్ తో నాగ చైతన్య భారీ బడ్జెట్ మూవీ..డైరెక్టర్ ఎవరో తెలిస్తే అక్కినేని అభిమానులు మెంటలెక్కిపోతారు!

అక్కినేని కుటుంబం నుండి నాగ చైతన్య మీడియం రేంజ్ హీరో నుండి స్టార్ లీగ్ లోకి వెళ్ళబోతున్నాడా?..ఆయన ఏర్పాటు చేసుకుంటున్న లేటెస్ట్ కాంబినేషన్స్ ని చూస్తే నిజమే అనిపిస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 28, 2024 / 09:05 PM IST
    Follow us on

    Naga Chaitanya : అక్కినేని కుటుంబం నుండి నాగ చైతన్య మీడియం రేంజ్ హీరో నుండి స్టార్ లీగ్ లోకి వెళ్ళబోతున్నాడా?..ఆయన ఏర్పాటు చేసుకుంటున్న లేటెస్ట్ కాంబినేషన్స్ ని చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలు ఎక్కువగా లవ్ స్టోరీవే. ఆయనకి అత్యధిక సక్సెస్ రేట్ ఇచ్చిన జానర్ కూడా ఇదే. దీంతో ఒక సెట్ ఆడియన్స్ కి మాత్రమే నాగ చైతన్య పరిమితం అవ్వడం, మరో లెవెల్ కి వెళ్లలేకపోతున్నాడు అనే అసంతృప్తి అక్కినేని అభిమానుల్లో కలగడం వంటివి జరుగుతున్నాయి. దానికి తోడు ఇప్పుడు నాగ చైతన్య తో పాటు అక్కినేని కుటుంబం మొత్తం వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లోనే ఉంది. ఒక్క భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలోనే నాగ చైతన్య తండేల్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రకటించడం తో అభిమానులు ఎంతో సంతోషించారు.

    ఈ చిత్రం పై అక్కినేని అభిమానుల్లోనే కాదు, ఆడియన్స్ లో కూడా మంచి హైప్ ఉంది. రీసెంట్ గా ఈ సినిమా నుండి విడుదలైన ‘బుజ్జి తల్లి’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. నాగ చైతన్య కేవలం ఈ ఒక్క పెద్ద ప్రాజెక్ట్ తోనే సరిపెట్టుకోలేదు. ఈ చిత్రం తర్వాత ఆయన బాహుబలి మేకర్స్ ‘ఆర్కా మీడియా’ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. నాగ చైతన్య ఇప్పటి వరకు లవ్ స్టోరీస్, మాస్ మూవీస్, ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేసాడు కానీ, హారర్ జానర్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ కోసం దూత అనే హారర్ వెబ్ సిరీస్ చేసాడు కానీ, అతి పూర్తి స్థాయి హారర్ చిత్రం కాదు. ఇప్పుడు నేషనల్ లెవెల్ లో కామెడీ హారర్ చిత్రాలు దుమ్ము లేపుతుండడంతో, నాగ చైతన్య ఆ జానర్ లో సినిమా చేయడానికి మొగ్గు చూపుతున్నాడట.

    ఈ చిత్రానికి సుమారుగా 120 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయబోతున్నారట. వచ్చే ఏడాది లో ఈ చిత్రం గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభించుకోనుంది. విరూపాక్ష లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తీక్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తుంది. స్టోరీ వినగానే నాగ చైతన్య చాలా సంతృప్తి చెందాడని, తన కెరీర్ ని మలుపు తిప్పే చిత్రం అవుతుందని బలంగా నమ్ముతున్నాడట. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 న ‘తండేల్’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తర్వాత నాగ చైతన్య వెంటనే ఈ హారర్ కామెడీ చిత్రానికి షిఫ్ట్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. కనీసం ఈ రెండు చిత్రాలతో అయినా అక్కినేని అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. రెండు చిత్రాలకు కూడా భారీ వసూళ్లు వచ్చే స్కోప్ ఉంది.