https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ తో మల్టీ స్టారర్ సినిమాకి సై అంటున్న బాలీవుడ్ స్టార్ హీరో…

Prabhas: తెలుగు సినిమా హీరోలు బాలీవుడ్ లో వరుస సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నారో అప్పటి నుంచి కూడా బాలీవుడ్ హీరోలకి వాళ్లు ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కావడం లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : June 20, 2024 / 10:21 AM IST

    Salman Khan multi-starrer movie with Prabhas

    Follow us on

    Prabhas: ప్రస్తుతం బాలీవుడ్ హీరోలందరూ కూడా ఏం సినిమాలు చేస్తున్నారో వాళ్లకు కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళ స్టార్ డమ్ ని స్క్రీన్ మీద సరిగ్గా పోట్రే చేసే డైరెక్టర్లు వాళ్లకు దొరకడం లేదు. ఇక ఎప్పుడైతే తెలుగు సినిమా హీరోలు బాలీవుడ్ లో వరుస సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నారో అప్పటి నుంచి కూడా బాలీవుడ్ హీరోలకి వాళ్లు ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కావడం లేదు. ఇక తెలుగులో ఉన్న హీరోలందరూ మాస్ కమర్షియల్ సినిమాలను చేయడంలో సిద్ధహస్తులు.

    అందుకే మనవాళ్ళు ఈజీ గా కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇక ఒకప్పుడు బాలీవుడ్ లో ఉన్న హీరోలందరూ తెలుగు సినిమాల పైన కామెంట్లు చేసేవారు. తెలుగు వాళ్ళు కమర్షియల్ సినిమాలు తప్ప వేరే సినిమాలు చేయరు అనేవారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ కమర్షియల్ సినిమాలే బాలీవుడ్ జనాలకు విపరీతంగా నచ్చి వాటిని సూపర్ హిట్ చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మురుగ దాస్ దర్శకత్వంలో ‘ సికిందర్ ‘ అనే సినిమా చేస్తున్నాడు.

    Also Read: Kalki 2898 AD: కల్కి సినిమాలో ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారంటే..?

    ఇక ఈ సినిమా తర్వాత అట్లీతో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలుగు హీరోలతో ఒక సినిమాలో కనిపిస్తే వాళ్లు కూడా ఎలివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే సల్మాన్ ఖాన్ అవకాశం దొరికితే ప్రభాస్ తో సినిమా చేస్తానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతుంది మాత్రం ప్రభాస్ అనే చెప్పాలి.

    Also Read: War 2: త్రిబుల్ ఆర్ ను మించి వార్ 2 లో ఫైట్ సీన్ ఉండబోతుందా..?

    ఎందుకంటే ఆయనను మించిన స్టాల్ హీరో మరొకరు లేరు. ఇక బ్యాక్ టు బ్యాక్ వరుసగా పాన్ ఇండియాలో 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇక తన ఫ్లాప్ సినిమాలకు కూడా 300 కోట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. తన నుంచి ఒక హిట్ సినిమా వస్తే మాత్రం 1000 కోట్ల పైనే కలెక్షన్లు వస్తున్నాయి. ఇక ఇదంతా చూస్తున్న ట్రేడ్ పండితులు సైతం ఇప్పుడు ప్రభాస్ ను టచ్ చేసే హీరో మరొకరు లేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు…