TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ చైర్‌పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని తానా కార్యదర్శి రాజా కసుకుర్తి వెల్లడించారు.
నియామకం ఇలా..
తానాలో ముఖ్యమైన టీమ్ స్వేర్ కమిటీకి చైర్‌పర్సన్‌గా కిరణ్ కొత్తపల్లిని నియమించగా తానా పత్రికకు సాయి బ్రహ్మానందం గొర్తి, వెబ్ కమిటీ చైర్ పర్సన్‌గా బిల్హన్ ఆలపాటిని నియమించినట్లు తెలిపారు. ఇక తానా కళాశాల చైర్‌పర్సన్‌గా మాలతి నాగభైరవ, తానా పాఠశాల చైర్‌పర్సన్‌గా భాను మాగులూరి, మెంబర్‌షిప్ వెరిఫికేషన్ కమిటీ సభ్యులుగా సుధీర్ చింతమనేని, శ్రీనివాస్ వల్లూరిపల్లిని నియమించారు.
తానా పదవీకాలం పూర్తయ్యే వరకు…
తానా ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం పూర్తయ్యే వరకు ఈ కమిటీలు పదవిలో కొనసాగుతాయి. ఆయా విభాగా బాధ్యతలను చైర్‌పర్సన్లు చూసుకుంటారు. అన్ని కమిటీలు సమర్థవంతంగా పనిచేసేలా సమర్థులను చైర్‌పర్సన్లుగా నియమించినట్లు తానా కార్యదర్శి రాజా కసుకుర్తి వెల్లడించారు.