Mileage Bike
Mileage Bike : ప్రస్తుతం ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ద్విచక్ర వాహనాలకు భారీ డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న కంపెనీలు కొత్త కొత్త బైకులను మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంటాయి. ఎలక్ట్రిక్ బైక్స్ విరివిగా వస్తున్న ఈ రోజుల్లో వాటి నుంచి పోటీ తట్టుకునేందుకు అధిక మైలేజీ ఇచ్చే టెక్నాలజీ మీద కంపెనీలు దృష్టి సారించాయి. మన దేశంలో పెద్ద మొత్తంలో ఉన్న మధ్య తరగతి ప్రజల కోసం ఇప్పటికే అధిక మైలేజీ ఇచ్చే ఎన్నో రకాల బైక్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు రోజూ ఇంటి నుంచి ఆఫీసుకు ప్రయాణించడానికి తక్కువ ధరతో పాటు మంచి మైలేజీని ఇచ్చే బైక్ కోసం చూస్తున్నట్లయితే.. భారత మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన బైక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని తక్కువ ధరకే ఎక్కువ మైలేజీ అందిస్తుంటాయి.
Also Read : అత్యధిక మైలేజీ ఇచ్చే ఐదు బైక్‌లు ఇవే..
మీరు కొత్త మోటార్ సైకిల్ కొనాలని ప్లాన్ చేస్తుంటే టీవీఎస్ స్పోర్ట్ మధ్య తరగతి వాళ్లకు బెస్ట్ ఆఫ్షన్ గా చెప్పవచ్చు. ఆ బైక్ ఆన్-రోడ్ ధర, EMI, డౌన్ పేమెంట్ గురించి కూడా ఈ కథనంలో తెలసుకుందాం. టీవీఎస్ స్పోర్ట్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఢిల్లీలో దాని బేస్ వేరియంట్ స్పోర్ట్ సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్ వీల్స్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ.72 వేలు. దీని టాప్ వేరియంట్ స్పోర్ట్ సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్ వీల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 86 వేలు.
ప్రతి నెలా ఎంత వాయిదాలు చెల్లించాలి?
న్యూఢిల్లీలో మాత్రమే కాకుండా హైదరాబాద్ లో ఉండే వాళ్లు కూడా రూ. 10,000 డౌన్ పేమెంట్ చెల్లించి బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇందుకు రూ. 62,000టూ వీలర్ లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ 9.7 శాతం వడ్డీ రేటుకు లభిస్తుంది. ఈ లోన్ తిరిగి చెల్లించడానికి, మీరు 3 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 2,000 ఈఎంఐ చెల్లించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..రుణం, వడ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి.
టీవీఎస్ స్పోర్ట్ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది?
టీవీఎస్ స్పోర్ట్ బైక్ విషయానికొస్తే.. ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికి టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్ల కంటే ఎక్కువ. మార్కెట్లో ఈ బైక్ హీరో HF 100, హోండా CD 110 డ్రీమ్, బజాజ్ CT 110X లతో పోటీపడుతుంది. హీరో HF 100 లో 97.6 cc ఇంజిన్ ఉంది. దీనిని కంపెనీ అప్‌డేట్ చేసింది.
Also Read : లక్షరూపాయల లోపు ఎక్కువ మైలేజీ ఇచ్చే టూ వీలర్స్ ఏవో తెలుసా?