Best Mileage Bikes
Best Mileage Bikes: సూదూరంగా సింగిల్ గా ప్రయాణించాలంటే బైక్ కన్వినెంట్ గా ఉంటుంది. కానీ ఈరోజుల్లో ఏ ద్విచక్రవాహనమైన లక్షకు పైగానే ధర పలుకుతోంది. దీంతో చాలా మంది అవసరం ఉన్నా బైక్ కొనలేని పరిస్థితి. అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల కారణంగా ప్రతీ కంపెనీ దాదాపై బైక్ ధరలు పెంచేసింది. అయితే చాలా మంది అప్పులు చేసి మరీ లక్షలు పెట్టి ద్విచక్రవాహనాలను కొంటున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం అవసరం ఉన్న వరకే బైక్ ను కొనుగోలు చేయాలని తెలుపుతున్నారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు బైకుల్లో కొన్ని మార్పులు చేసి తక్కువ ధరకే విక్రయిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
Tvs స్పోర్ట్స్:
అత్యధిక మైలేజ్ అందించే బైకుల్లో టీవీఎస్ స్పోర్ట్స్ ఒకటి. వైబ్రేట్ గ్రాఫిక్స్, అల్లాయ్ వీల్స్, స్పోర్టీ కలర్ స్కీమ్స్ తో టీవీఎస్ స్పోర్ట్స్ ఆకట్టుకుంటుంది.109 సిసి ఇంజన్, లీటర్ కు 70 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఇది 8.18 బిహెచ్ పీ పవర్ తో మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఇండియాలో ఈ బైక్ ఇప్పటివరకు 20 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఈ బైక్ ఎక్ష్ షో రూం ధర రూ.63,950 తో విక్రయిస్తున్నారు.
హీరో Super Splender:
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో హీరో సూపర్ స్పెండర్ ఒకటి. రోజువారి ప్రయాణికులకు ఈ బైక్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. సూపర్ స్పెండర్ 125 సిసి ఇంజన్ తో లీటర్ కు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 10.73 బిహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఇందులో ఉంటుంది. ఈ బైక్ ధర ఎక్స్ షోరూం ధర రూ.73,900 తో విక్రయిస్తున్నారు.
హోండా SP 125:
హోండా కంపెనీ నుంచి 125 సిసి బైక్ గా ఇది పాపులర్ అయింది. ఈ వెహికల్ లో 123.94 సిసి ఇంజన్ 10.72 బిహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ కు 68 కిలోమీటర్ మైలేజీ అందించే ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ట్యూబ్ లెస్ టైర్లు, లైవ్ వీల్స్, ఎలక్ట్రికల్ స్టార్ట్ అప్ ఆప్షన్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ బైక్ బెస్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. దీనిని సొంతం చేసుకోవాలంటే రూ.78,400 చెల్లించాలి.
హీరో సూపర్ స్పెండర్ ఎక్స్ టెక్:
హీరో కంపెనీ నుంచి మరో బైక్ లక్ష రూపాయల లోపు అందిస్తోంది. అదే సూపర్ స్పెండర్ ఎక్స్ టెక్. ఇందులో ఎల్ఈడి లైటింగ్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్ బీ చార్జర్, ఆటో సేల్ టెక్నాలజీ వంటీ అడ్వాన్స్ ఫీచర్లను అందిస్తుంది. ఈ బైక్ లో 125 సిసి ఇంజన్ ఉండి లీటర్ కు 60 కిలోమీటర్లు అందిస్తుంది. 10.7 బిహెచ్పి పవర్ ను ఉత్పత్తి చేసే ఈ బైక్ ధర రూ. 84,000.
హోండా సిబి యూనికార్న్:
హోండా సిబి యూనికాన్ బైక్ లో 163 సిసి ఇంజన్ 13.82 బిహెచ్ పవర్ అందిస్తుంది 12 లీటర్ల ట్యాంక్ ను కలిగి ఉన్న ఇందులో 163 సీసీ తో లీటర్ కు 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఆకట్టుకునే పనితీరును కలిగిన ఈ బైక్ ధర రూ.98,900.