MG Motors Windsor : దేశంలో Electric కార్ల కొనుగోళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొత్తగా కార్లు కొనేవారితో పాటు పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో ఈవీలను మార్చుకుంటున్నారు.ఈ క్రమంలో కొన్ని కంపెనీలు పోటీపడి కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అయితే ఇలా మార్కెట్లోకి వచ్చిన విద్యుత్ కార్లలో కొన్ని మాత్రమే ఎక్కువ సేల్స్ ను నమోదు చేసుకుంటున్నాయి. ఇటీవల MG Motores కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టించింది. ఈ కంపెనీకి చెందిన ఓ కారు ప్రతి నెల 3 వేలకు పైగా యూనిట్ల విక్రయాలు జరుపుకుంటుంది. దీంతో దిగ్గజ కార్ల కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా వంటివి షాక్ తింటున్నాయి. ఇంతకీ ఎంజీ మోటార్స్ కు చెందిన ఏ కారు రికార్డులు సృష్టించిందో చూద్దాం..
MG Motors కార్లు చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉంటాయి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన చాలా మోడళ్లు వినియోగదారులను ఆకర్షించాయి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ హవా కొనసాగుతున్న సమయంలో ఈ కంపెనీ Windsor ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 2024 ఆగస్టులో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు అమ్మకాల్లో తగ్గేదేలే.. అన్నట్లుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా 2025 జనవరిలో ఈ మోడల్ 3,277 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. 2024 ఏడాదిలో పరిశీలిస్తే డిసెంబర్ లో 3,785 యూనిట్లు, నవంబర్ లో 3,144 యూనిట్లు, అక్టోబర్ లో 3,116 కార్లను విక్రయించింది.
MG Windsor మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో Exite, Exclusive, Essencce ఉన్నాయి. అలాగే ఇది బ్లాక్, క్లే బీజ్, పెర్ల్ వైట్, టర్కోయిస్ గ్రీన్ అనే కలర్లలో అందుబాటులో ఉంది. ఈ కారులో 38 కిలో వాట్ బ్యాటరీ సెటప్ ను అమర్చారు. ఇది 134 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 200 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ బ్యాటరీ ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 331 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
ఈ కారు ఫీచర్స్ ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి. ఇందులో స్ల్పిట్ ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ ఈడీ డీఆర్ఎల్, ఎల్ ఈడీ లైట్ బార్ లు ఉన్నాయి. అలాగే డోర్ హ్యాండిల్స్ ఫ్లస్ పిట్టింగ్ తో అమర్చారు. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉండే ఈ కారులో స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్స్ ను మార్చుకోవచ్చు. ఇంటీరియర్ విషయానికొస్తే ఇందులో 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ను అమర్చారు. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జింగ్ ఫోన్ ను సెట్ చేశారు.
సేప్టీలోనూ ఏమాత్రం తగ్గకుండా ఇందులో స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటివి రక్షణ ఇస్తాయి. దీనిని రూ. 13.99 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 15.99 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ కారు డిజైన్ కూడా అద్భుతంగా ఉండడంతో చాలా మంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.