Vishvak Sen : విశ్వక్ సేన్(Vishwak Sen) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లైలా(Laila Movie)’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. కమెడియన్ పృథ్వీ విపక్ష(comedian prudhvi) పార్టీ గా పిలవబడే వైసీపీ ని ఉద్దేశించి వేసిన సెటైర్లకు కార్యకర్తలు చాలా ఫీల్ అయ్యారు. సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా ‘#BoycottLaila’ ట్యాగ్ తో పెద్ద ఎత్తున నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ పై దాదాపుగా మూడు లక్షల ట్వీట్స్ పడ్డాయి. కొంతమంది వైసీపీ కార్యకర్తలు అయితే సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ ప్రింట్ సోషల్ మీడియా లో దింపేస్తామని బెదిరించారు. ఈ ట్వీట్స్ చూసి విశ్వక్ సేన్ తన నిర్మాతతో కలిసి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పి, తన సినిమాని చంపొద్దు అంటూ వేడుకున్నాడు.
అయినప్పటికీ కూడా తగ్గని వైసీపీ కార్యకర్తలు విశ్వక్ సేన్ సోషల్ మీడియా లో అప్లోడ్ చేసే ఫోటోల క్రింద విశ్వక్ సేన్ ని అసభ్యమైన పదాజాలంతో దూషిస్తూ తిట్టడం మొదలు పెట్టారు. దీనికి చిర్రెత్తిపోయిన విశ్వక్ సేన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో మధ్య వేలు చూపిస్తూ, ‘ఏమి పీక్కుంటారో..పీక్కోండి’ అన్నట్టుగా ఒక ఫోటోని అప్లోడ్ చేసాడు. దీనికి వైసీపీ పార్టీ కార్యకర్తలు మరింతగా హార్ట్ అయ్యి, నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఏమైనా సంబంధం ఉందా, నీ సినిమా థియేటర్స్ లో ఎలా ఆడుతుందో మేము కూడా చేస్తాము ఖబర్దార్ అంటూ వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ‘గేమ్ చేంజర్’ కి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసారు గా, జగన్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే అలాగే ఉంటుందని మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా వైసీపీకి కౌంటర్ గా విశ్వక్ సేన్ ని సపోర్ట్ చేస్తూ టీడీపీ, జనసేన అభిమానులు ట్వీట్స్ వేస్తున్నారు.
అయినా ఒక సినిమాని చంపాలనుకుంటే ఎవ్వరూ చంపలేరు, ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ అయ్యిందంటే అందుకు కారణం ఆ సినిమాలో బలమైన కంటెంట్ లేదని అర్థం. రేపు ఒకవేళ ‘లైలా’ చిత్రంలో కూడా కంటెంట్ లేకుంటే ఫ్లాప్ అవ్వొచ్చు. అంత మాత్రానా మా వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది అనుకుంటే మూర్ఖత్వమే అని విశ్లేషకుల అభిప్రాయం. లైలా చిత్రంలో బలమైన కంటెంట్ ఉంటె ఎన్ని లక్షల నెగటివ్ ట్వీట్స్ వేసినా ఆ సినిమాని సూపర్ హిట్ అవ్వకుండా ఆపలేరు. ‘లైలా’ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పాటలు, ట్రైలర్ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. విశ్వక్ సేన్ హిట్ కొట్టబోతున్నాడు అనే నమ్మకాన్ని కలిగించింది. ఇప్పుడు ఈ వివాదాల్లో చిక్కుకోవడం వల్ల మూవీ పై మరింత హైప్ పెరిగింది.