Homeబిజినెస్MG Motors : ఆలస్యం చేస్తే ఆఫర్ మిస్.. ఆ కారుపై ఏకంగా 3.92 లక్షల...

MG Motors : ఆలస్యం చేస్తే ఆఫర్ మిస్.. ఆ కారుపై ఏకంగా 3.92 లక్షల తగ్గింపు

MG Motors : ఎంజీ మోటార్ తన ప్రీమియం SUV హెక్టర్‌పై ఈ నెలలో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నెలలో హెక్టర్ SUV కొనుగోలు చేస్తే ఏకంగా రూ.3.92 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు. కస్టమర్‌లకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. హెక్టర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.14 లక్షల నుండి రూ.22.88 లక్షల వరకు ఉన్నాయి. హెక్టర్‌పై లభించే డిస్కౌంట్ ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, మీరు ఈ SUVని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, దీనిపై లభించే డిస్కౌంట్ గురించి తప్పక తెలుసుకోవాలి.

Also Read : మారుతి పెంచేసింది.. హ్యుందాయ్ తగ్గించేసింది.. కస్టమర్లకు పండగే పండుగ!

ఎంజీ హెక్టర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
హెక్టర్ ఇంజన్ విషయానికి వస్తే.. ఇది 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 143 PS శక్తిని, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 2-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 170 PS శక్తిని, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది. అయితే, పెట్రోల్ ఇంజన్‌తో 8-స్పీడ్ CVT గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభిస్తుంది.

ఎంజీ హెక్టర్ ప్లస్‌లో 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన కొత్త 14-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. దీని క్యాబిన్‌లో డ్యూయల్-టోన్ అర్గిల్ బ్రౌన్, బ్లాక్ ఇంటీరియర్, లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ , లెదరెట్ సీట్ అప్హోల్స్టరీతో ప్రీమియం అనుభూతి లభిస్తుంది. ఇతర ఫీచర్లలో స్మార్ట్ కీతో కూడిన పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్, 17.78 సెం.మీ. LCD స్క్రీన్‌తో కూడిన పూర్తి డిజిటల్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెలెక్ట్ ప్రో, స్మార్ట్ ప్రో వేరియంట్‌లు పవర్ డ్రైవర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం లెదరెట్ సీట్ అప్హోల్స్టరీ, క్రూజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి ఫీచర్లతో వస్తాయి.

Also Read : పెట్రోల్ ఖర్చులకు టాటా చెప్పేయండి..ఇప్పుడు కొంటే రూ.70వేల తగ్గింపు

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version