https://oktelugu.com/

Sandeep Reddy Vanga : సందీప్ వంగ తన సినిమాలకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ను వాడటానికి కారణం ఏంటంటే..?

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన ప్రభంజనం అలాంటిది. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ను కూడా క్రియేట్ చేసి పెట్టాయి...

Written By: , Updated On : April 6, 2025 / 04:39 PM IST
Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

Follow us on

Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga)… ఆయన చేసిన సినిమాలన్నింటితో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుందనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోం…ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి… అయితే ఆయన సినిమాలో ఎక్కువగా స్ట్రైట్ స్క్రీన్ ప్లే ని వాడకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వాడతాడు అంటూ సందీప్ రెడ్డి వంగ మీద కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తూ ఉంటారు. నిజానికి ఎలాంటి స్క్రీన్ ప్లే వాడిన కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే సీన్స్ సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తోంది.

Also Read : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో కనిపించనున్న ఆర్జీవీ…ఆయన క్యారెక్టర్ ఏంటంటే..?

లేకపోతే మాత్రం చాలా వరకు డీల పడిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాలతో భారీ విజయాన్ని అందుకొని సందీప్ మరోసారి తన స్టామినా చూపించాలని చూస్తున్నాడు. నిజానికి ఆయన సినిమాల్లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వాడి సినిమాను ప్రెసెంట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే స్ట్రైట్ నరేషన్ లో సినిమా చెబితే ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు.

కాబట్టి సినిమాను నాలినియర్లో ఓపెన్ చేసి ఆ సినిమా ఎందుకలా జరిగింది అసరా కథలో ఏముంది అనే ప్రేక్షకుడిలో ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అందువల్లే ఆయన సినిమాల్లో ప్రతి ఎలిమెంట్ కూడా హైలైట్ అవుతూ ఉంటుంది…

తను చేయబోయే సినిమాల్లో కూడా ఇలాంటి స్క్రీన్ ప్లే నే వాడతాడా లేదంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లేని ప్రెసెంట్ చేసే ప్రయత్నం చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మరి మొత్తానికైతే ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు. తద్వారా ఆయనకు ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక సందీప్ రెడ్డి వంగ తో పని చేయాలని చాలా మంది హీరోలు అనుకుంటున్నారు. చూడాలి మరి ఆయన తన తర్వాత సినిమాలను ఏ హీరోలతో చేస్తాడు అనేది…

Also Read : పెద్ది’ ని ‘దసరా’ తో పోలుస్తున్న నెటిజెన్స్..రెండిటి మధ్య ఉన్న తేడాలు ఇవే!