Car Price : ఏప్రిల్ నెలలో మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి దాదాపు అన్ని కంపెనీలు తమ కార్ల ధరలను పెంచాయి. మారుతి గ్రాండ్ విటారా ధర అయితే ఏకంగా రూ. 62,000 వరకు పెరగనుంది. మారుతి వ్యాగన్ఆర్, ఎర్టిగా ధరలు కూడా వేలల్లో పెరగనున్నాయి. ఇలాంటి సమయంలో మారుతికి పోటీగా ఉన్న హ్యుందాయ్ కంపెనీ తన కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
Also Read : పెద్ద ఫ్యామిలీకి ఒకే ఒక్క బస్సు.. హైఏస్ ఉంటే మీ ట్రిప్ సూపర్ హిట్!
దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఏప్రిల్ నెలలో తన కార్లపై ఏకంగా రూ. 70,000 వరకు తగ్గింపును అందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, వెన్యూ, ఎక్స్‌టర్, వెర్నా, టక్సన్ వంటి వివిధ మోడళ్లపై వేర్వేరు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఏ కారుపై ఎంత డిస్కౌంట్?
హ్యుందాయ్ తన ఎంట్రీ లెవెల్ కార్ల నుండి టక్సన్ వంటి పెద్ద కార్ల వరకు భారీ తగ్గింపులను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపింగ్ బోనస్, కార్పొరేట్ బోనస్ వంటి ఆఫర్లు ఉన్నాయి. మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి:
* హ్యుందాయ్ వెన్యూ: రూ. 70,000 వరకు తగ్గింపు. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ఎన్-లైన్ వెర్షన్‌పై కూడా రూ. 35,000 వరకు డిస్కౌంట్ ఉంది.
* హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: రూ. 68,000 వరకు తగ్గింపు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
* హ్యుందాయ్ ఐ20: రూ. 65,000 వరకు తగ్గింపు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. దీని ఎన్-లైన్ వేరియంట్‌పై రూ. 45,000 వరకు డిస్కౌంట్ ఉంది.
* హ్యుందాయ్ వెర్నా: రూ. 50,000 వరకు తగ్గింపు. ఇది 1.5 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.
* హ్యుందాయ్ టక్సన్: రూ. 50,000 వరకు తగ్గింపు. ఈ ఎస్‌యూవీ 2.0 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. టాప్ వేరియంట్‌లో ఆల్-వీల్ డ్రైవ్ కూడా ఉంది.
* హ్యుందాయ్ ఎక్స్‌టర్: రూ. 50,000 వరకు తగ్గింపు. ఈ కారు ఇంజన్ గ్రాండ్ ఐ10 నియోస్‌ను పోలి ఉంటుంది.
* హ్యుందాయ్ ఆరా: రూ. 48,000 వరకు తగ్గింపు. ఇది గ్రాండ్ ఐ10 నియోస్ సెడాన్ వెర్షన్ లాంటిది.
మారుతి కార్ల ధరలు పెరుగుతున్న సమయంలో హ్యుందాయ్ భారీ డిస్కౌంట్లను ప్రకటించడం వినియోగదారులకు నిజంగా శుభవార్త అని చెప్పొచ్చు.
Also Read : పెట్రోల్ ఖర్చులకు టాటా చెప్పేయండి..ఇప్పుడు కొంటే రూ.70వేల తగ్గింపు