MG M9 : ఇండియన్ కార్ మార్కెట్‌లో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంజీ మోటార్ ఇండియా తమ ప్రీమియం ఛానల్ ఎంజీ సెలక్ట్ ద్వారా ఒక అల్ట్రా-లగ్జరీ ఆల్-ఎలక్ట్రిక్ లిమోసిన్ ఎంజీ ఎం9 అధికారిక బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ లిమోసిన్‌ను బుక్ చేసుకోవాలనుకుంటే.. కేవలం రూ.51,000 టోకెన్ అమౌంట్ చెల్లిస్తే చాలు.. అంతేకాదు, ఎంజీ సెలక్ట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు.. మీ ఇంటి దగ్గరలోని ఎంజీ షోరూమ్‌కు వెళ్లి కూడా బుక్ చేసుకోవచ్చు.
ఎంజీ ఎం 9స్పెసిఫికేషన్లు
ఎంజీ మోటార్ త్వరలోనే భారతీయ మార్కెట్‌లో తన కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ ఎంపీవీ ఎంజీ ఎం9ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు సైజు, ఫీచర్ల విషయంలో తన పోటీదారులైన కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్‌లకు గట్టి పోటీనిస్తుంది. దీని పొడవు 5200 మిమీ, వెడల్పు 2000 మిమీ, ఎత్తు 1800 మిమీ, వీల్‌బేస్ 3200 మిమీ. దీంతో ఇది సైజులో అతిపెద్ద ఎంపీవీగా నిలుస్తుంది. అంటే లోపల చాలా విశాలంగా ఉంటుంది.
Also Read : 10 లక్షల కారుతో MG సంచలనం.. 8 నెలల్లోనే రికార్డు అమ్మకాలు!
ఎం9 డిజైన్ బాక్సీగా ఉన్నప్పటికీ, చూడటానికి చాలా మోడర్న్‌గా, ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో నిటారుగా ఉండే ముక్కు భాగం, LED లైట్లు, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్‌లు, చుట్టూ క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ కారును 7, 8 సీటర్ లేఅవుట్‌లలో అందించవచ్చు. పెద్ద కుటుంబాలకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక అవుతుంది అనడంలో సందేహం లేదు.
ఎంజీ ఎం9 ఇంటీరియర్
దీని ఇంటీరియర్ లగ్జరీ అనుభూతిని కలిగిస్తుంది. హీటెడ్, వెంటిలేటెడ్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన సీట్లు, ఫోల్డ్-అవుట్ ఆటోమన్, పవర్డ్ స్లైడింగ్ డోర్‌లు, డ్యూయల్ సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్, రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ దీని ముఖ్యమైన ఫీచర్లు. అంతేకాకుండా, ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. అంటే ప్రయాణం చాలా సౌకర్యంగా, సురక్షితంగా ఉంటుంది. ఎంజీ ఎం9లో 90కిలో వాట్స్ బ్యాటరీని ఇచ్చారు, ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 430 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 245 హార్స్‌పవర్, 350ఎనోఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ఫుల్ ఇంజిన్‌తో లాంగ్ డ్రైవ్‌లు కూడా హాయిగా చేయవచ్చు. దీని అంచనా ధర రూ. 65-70 లక్షల మధ్య ఉండవచ్చు.
Also Read : ఎంజీ నుంచి మరో సెన్సేషన్.. ఈ ఏడాదిలో 2 అదిరిపోయే కార్లు