Mercedes-Benz : త్వరలో కస్టమర్ల జేబుకు బెంజ్ కంపెనీ చిల్లు పెట్టనుంది. మెర్సిడెస్-బెంజ్ తమ కార్లన్నింటి ధరలను 1.5 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ ధరల పెంపును రెండు దశల్లో అమలు చేయనుంది. మొదటి దశ జూన్ 1 నుంచి, రెండవ దశ సెప్టెంబర్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. రెండు దశల్లో ధరలను పెంచడానికి గల ముఖ్య ఉద్దేశ్యం వినియోగదారులపై పడే భారాన్ని తగ్గించాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఈ ధరల పెరుగుదల రూ.90,000 నుంచి రూ.12.2లక్షల మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది.
Also Read : మెర్సిడెస్ నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి.. ధర, ఫీచర్స్ కేక.. 560 కిలోమీటర్ల రేంజ్..
మెర్సిడెస్-బెంజ్ కంపెనీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయంలో స్వల్ప భాగాన్ని మాత్రమే వినియోగదారులపై వేస్తున్నట్లు తెలిపారు. సి-క్లాస్ ధరలో కనిష్టంగా రూ.90,000 పెరుగుదల ఉండగా, ఇప్పుడు దీని ప్రారంభ ధర రూ.60.3 లక్షలు. మరోవైపు, మెర్సిడెస్-మేబాక్ ఎస్-క్లాస్ ధర గరిష్టంగా రూ.12.2 లక్షలు పెరగనుంది. దీంతో దీని కొత్త ధర రూ.3.60 కోట్లు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద వర్తిస్తాయి.
ధరల పెంపునకు ఇతర కారణాలు
మెర్సిడెస్ తెలిపిన ప్రకారం.. ఇప్పటివరకు పెరుగుతున్న వ్యయాలను భరించినప్పటికీ మెయింటెనెన్స్ ఖర్చులను తిరిగి రాబట్టడానికి, వ్యాపారాన్ని స్థిరంగా ఉంచడానికి ధరలను పెంచవలసి వస్తోందని తెలిపింది. ఈ సంవత్సరం జనవరి నుంచి విదేశీ మారకపు రేట్లలో భారీ పెరుగుదల కారణంగా ధరల సవరణ చేయవలసి వచ్చిందని ఆటోమేకర్ పేర్కొంది. ఇది విడిభాగాలు, ఉత్పత్తులు, ముఖ్యంగా పూర్తిగా దిగుమతి చేసుకున్న మోడళ్ల వ్యయ నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
రెండుసార్లు పెంచడం వల్ల కలిగే ప్రయోజనం
రెండు దశల్లో ధరలను పెంచడం గురించి కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇది వినియోగదారులకు వారి కొనుగోలు ప్రణాళికలను రూపొందించడానికి, వారి అవసరాలకు అనుగుణంగా మెరుగైన ఆర్థిక ప్రణాళికను చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపింది. GLC, GLC SUV వంటి మోడళ్ల కోసం ఈఎంఐ వ్యత్యాసం రూ.2,000 కంటే తక్కువగా ఉంటుందని మెర్సిడెస్-బెంజ్ కంపెనీ పేర్కొంది.
Also Read : భారత్ లో అమ్ముడయ్యే టాప్ లగ్జరీ కార్ బ్రాండ్లు ఇవీ