https://oktelugu.com/

Top Luxury Car Brands In India: భారత్ లో అమ్ముడయ్యే టాప్ లగ్జరీ కార్ బ్రాండ్లు ఇవీ

Top Luxury Car Brands In India: ఫ్యామిలీతో కలిసి కాస్త దూరం ప్రయాణించాలంటే బైక్ సరిపోదు. కారు ఉంటే కుటుంబమంతా కలిసి హాయిగా షికారు వెళ్లొచ్చు. ముట్టుకుంటే అంటుకునే కరోనా వైరస్ వచ్చాక జనాల మైండ్ సెట్ మారింది. ప్రజారవాణా కంటే సొంతగా సెకండ్ హ్యాండ్ కారు అయినా ఉంటే పర్లేదు అని కొనేస్తున్నారు. ఇక చిన్న కార్ల ధరలు కూడా తక్కువగా ఉండడంతో వాటిని కొనుగోుల చేస్తున్నారు. ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో కొన్ని తక్కువ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 28, 2022 / 11:11 AM IST
    Follow us on

    Top Luxury Car Brands In India: ఫ్యామిలీతో కలిసి కాస్త దూరం ప్రయాణించాలంటే బైక్ సరిపోదు. కారు ఉంటే కుటుంబమంతా కలిసి హాయిగా షికారు వెళ్లొచ్చు. ముట్టుకుంటే అంటుకునే కరోనా వైరస్ వచ్చాక జనాల మైండ్ సెట్ మారింది. ప్రజారవాణా కంటే సొంతగా సెకండ్ హ్యాండ్ కారు అయినా ఉంటే పర్లేదు అని కొనేస్తున్నారు. ఇక చిన్న కార్ల ధరలు కూడా తక్కువగా ఉండడంతో వాటిని కొనుగోుల చేస్తున్నారు. ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో కొన్ని తక్కువ ధర కార్లు ఉన్నాయి. ఇదే సమయంలో లగ్జరీ కార్లు కూడా మార్కెట్లో కొత్త కొత్తగా వస్తున్నాయి. ఆయా కుటుంబాలు, వారి అవసరాలను బట్టి కార్లను కొనుగోలు చేస్తూంటారు. భారతదేశంలో కార్ల వినియోగం బాగా పెరిగింది. ఎక్కువ మంది కుటుంబమంతా కూర్చొని ప్రయాణించే కార్లను ఎంత ధర అయినా పెట్టి కొనేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే లగ్జరీకార్ల అమ్మకాలు కూడా దేశంలో జోరుగా సాగుతున్నాయి. వినియోగదారులకు అనుగుణంగా ఆటో కంపెనీలు సైతం రకరకాల కార్లను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లు, ఫవర్ ఫుల్ ఏసీ, వెల్ కూషన్డ్ సీట్లు, మంచి మ్యూజిక్ సిస్టం లాంటి ఫీచర్లు ఉన్న కార్లు వస్తున్నాయి. మనదేశంలో లగ్జరీ కార్ల వినియోగం కూడా బాగా పెరిగింది. మెర్సిడేస్ బెంజ్, బీఎం డబ్లూ, ఆడీ, జాగ్వార్, వోల్వో, కూపర్, పోర్స్చే, లంబోర్ఘిని, ఇంకా చాలా విదేశీ బ్రాండెడ్ కంపెనీల కార్ల ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే భారతీయుల వాడకం తెలిసిన కొన్ని కంపెనీలు తమ బ్రాంచ్ లను ఇండియాలోను ఏర్పాటు చేస్తున్నారు. భారత్ లో లగ్జరీ కార్ల కంపెనీల వివరాలపై ఓ లుక్ వేద్దాం..

    -మెర్సిడెస్ -బెంజ్:

    Mercedes-Benz

    లగ్జరీ కార్ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ మెర్సిడేస్ బెంజ్. ఈ కంపెనీ 2020లో 2.1 మిలియన్ ప్యాసింజర్ కార్లను తయారు చేసింది. అలాగే 3,75,000 వ్యాన్ లను విక్రయించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 35 రకాల వాహనాలు ఉత్పత్తి చేస్తోంది. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ మొబలిటీ వాహనాలను కూడా తయారు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా లక్షా 70 వేల మంది పనిచేస్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్ వాటా 39 శాతం కలిగి ఉంది.

    Also Read: Viral Picture: ఇక్కడ పిల్లి ఎక్కడ ఉందో తెలుసా?

    -బీఎండబ్ల్యూ గ్రూప్:

    BMW Group

    బీఎండబ్ల్యూ కార్లు దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న లగ్జరీ కార్లలో ఒకటి. బీఎండబ్ల్యూ, మినీ, రోల్స్ రాయస్, బీఎం డబ్ల్యూ మోటోరాడ్ బ్రాండ్ లతో ప్రపంచంలోనే అగ్రగామిగా ఈ సంస్థ కొనసాగుతోంది. ప్రీమియం ఫైనాన్షియల్, మొబలిలిటీ సేవలను అందిస్తున్న ఈ సంస్థలో 1,25 000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మార్కెట్ వాటా 27 శాతం కలిగి ఉంది.

    -ఆడి బ్రాండ్:

    Audi

    ఆడి అంటే స్పోర్టీ వెహికిల్స్. హై బిల్డ్ క్వాలిటీ, ప్రొగ్రెసివ్ డిజైన్ కలిగి ఉన్న ఈ కంపెనీ భారతదేశంలో మూడవ అతిపెద్ద లగ్జరీ బ్రాండ్. ఈ కంపెనీలో 87 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మార్కెట్ వాటా 16 శాతం కలిగి ఉంది.

    -జాగ్వార్ బ్రాండ్:

    Jaguar

    1935 నుంచి ఉత్పత్తి అవుతున్న జాగ్వార్ బ్రాండ్ ఇప్పటికీ రాజీ పడకుండా వాహనాలను తెస్తోంది. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు సర్ విలియం లియోన్స్ ప్రేరణతో కంపెనీ అభివృద్ధి చెందింది. ఎఫ్ టైప్ ని ప్రారంభించి, రెండు సీట్ల స్పోర్ట్స్ కారును తయారు చేసింది. సీ, డీ, ఈ రకాలతో ప్రారంభమైన బ్లడ్ లైన్ ను కొనసాగిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత అందమైన లగ్జరీ కారుగా జాగ్వార్ ను చెప్పుకుంటారు. ఈ కంపెనీ మార్కెట్ వాటా 13 శాతాన్ని కలిగి ఉంది.

    -వోల్వో:

    Volvo

    చైనాకు చెందిన వోల్వో కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. భారత్ లోనూ తన హవా సాగిస్తోంది. వోల్వో కార్లు మొబిలిటీ, వోల్వో కార్ గ్రూప్ ద్వారా కార్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ కేర్ వ్యూహాత్మక అనుబంధాలలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. 1927లో మొదటి వోల్వో ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా వోల్వో కార్లు అత్యంత ప్రసిద్ధి చెందినవిగా ఉన్నాయి. దీని మార్కెట్ వాటా 7 శాతంగా ఉంది.

    -మినీ కూపర్:

    MINI Cooper

    మినీ కూపర్ లగ్జరీ కార్లు భారతీయ మార్కెట్లో 2 శాతం గా ఉన్నాయి.. భారత్ లో అతిపెద్ద ఆరో పెద్ద లగ్జరీ కారు మినీ కూపర్.

    -పోర్స్చే బ్రాండ్:

    Porsche

    ప్రపంచ వ్యాప్తంగా 30 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో పోర్స్చే కారు ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఈ బ్రాండ్ నుంచి లీప్ జిగ్, సిల్వర్ స్టోన్, అట్టాంటా, లే మాన్స్, లాస్ ఏంజిల్స్ రోడ్లపై పోర్స్చే బ్రాండ్ ను చూడొచ్చు.

    ఇవే కాకుండా వోక్స్ వ్యాగన్ అనుబంధ సంస్థ లంబోర్ఘినీ కార్లను కూడా దేశంలో దిగుమతి చేసుకుంటున్నారు. ఇటీవల ఎన్టీఆర్ దీన్ని కోట్లు పోసి మరీ హైదరాబాద్ తెప్పించుకొని వాడుతున్నాడు. ఇకరాంచరణ్ సైతం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న న్యూ బ్రాండ్ బెంజ్ ను కొన్నారు. ఇలా పై బ్రాండ్స్ మాత్రమే కాదు.. ఎన్నో లగ్జరీ కార్లను దేశంలోని సంపన్నులు దిగుమతి చేసుకుంటూ తమ కార్ల ముచ్చటను తీర్చుకుంటున్నారు. దేశంలో అమ్ముడవుతున్న లగ్జరీ బ్రాండ్లు మాత్రం ఇవేనని చెప్పొచ్చు.

    Also Read:Petrol Price Hike: ‘పెట్రో’ధరల పాపం మోడీదా? రాష్ట్రాలదా?

    Tags