Mercedes-Benz EQA 250 Plus Price and Features
Mercedes-Benz: ఆటోమోబైల్ మార్కెట్లో హ్యాచ్ బ్యాక్, ఎస్ యూవీలకు ఎంత డిమాండ్ ఉన్నా లగ్జరీ కార్ల సేల్స్ ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే కొందరు ఎక్కువగా ఇటివంటి వెహికల్స్ ను మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. మార్కెట్లోకి ఏ కొత్త ఖరీదైన కారు వచ్చినా వెంటనే సొంతం చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో లేటేస్టుగా జర్మనీకి చెందిన మెర్సిడెస్ కంపెనీ నుంచి సరికొత్త కారు మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ కార్ల హవా సాగుతుండడంతో ఇది ఆ వేరియంట్ లోనే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కొత్తకారు ఫీచర్స్ అదిరిపోయాని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ మోడల్ ధర ఎలా ఉందో ఒకసారి చూద్దాం..
మెర్సిడెస్ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ‘బెంజ్ EQA’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది 2,729 వీల్ బేస్ ను కలిగి ఉంది. 1,624 మిల్లి మీటర్ల ఎత్తు, 4,463 మిల్లి మీటర్ల పొడవుతో కలిగి ఉంది. ఇందులో 70.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది.ఇది 35 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు చార్జింగ్ ను అందుకుంటుంది. మొత్తం ఛార్జింగ్ పూర్తి కావడానికి 7 గంటల సమయం పడుతుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 560 కిలోమీటర్ల వరకు ప్రయాణంచవచ్చు. ఈ నేపథ్యంలో దిని ఇంజిన్ 190 బీహెచ్ పీ పవర్ తో పాటు 385 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
EQA ఫీచర్స్ అద్భుతం అని కొందరు నిపుణలు పేర్కొంటున్నారు. ఈ కారు ముందు భాగంలో పియానో బ్లాక్ గ్రిల్ ఉంది. గ్రిల్ కు ఇరువైపులా ఎల్ ఈడీ లైట్లు, EQ మోడళ్లలాగా కనిపించే బ్లూ ఎలిమెంట్ ఉన్నాయి. గ్రిల్ కవర్ చేస్తూ లైన్ వస్తుంది. 250+బైక్ లో 19 అంగుళాల ఏఎంజీ లైట్ అల్లాయ్ వీల్స్ అమర్చారు. లెఫ్ట్ సైడ్ ప్యాటర్న్ ట్రిమ్ ఉంటుంది. హెడ్ ఆఫ్ డిస్ ప్లే కూడా అమర్చారు. ఇంటీరియర్ లో వైర్ లెస్ ఛార్జర్, ఆపాిల్ కార్ ప్లే కనెక్టివిటీ వంటివి ఆకర్షిస్తాయి.
లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. ఎందుకంటే ఇది డిస్ ప్లే రియాలిటీ టర్న్ బై టర్న్ నావిగేషన్ ను కలిగి ఉంది. డాల్బీ ఆట్మోస్ ను సపోర్ట్ చేస్తూ 710 వాట్ల సౌండింగ్ ను అమర్చారు. ఇందులో మొత్తం 12 స్పీకర్లు ఉంటాయి. ఇక EQA ధర రూ.66 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. ఇది మొత్తం 7 కలర్లలో అందుబాటులో ఉంది. EQతో సమానంగా ఇది పనిచేయనుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.