mercedes benz 600: సెలబ్రెటీల కార్లు ఖరీదైనవి ఉంటాయి. ప్రపంచంలో ఉన్న బెస్ట్ మోడల్స్ కొనుగోలు చేయాలని చూస్తారు. ముఖ్యంగా స్టార్ నటులు ఏ కారు కొనుగోలు చేసిన వాటి గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ప్రభాస్ వద్ద అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ, బీజేపీ నేత కంగనా రానౌత్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె కొనుగోలు చేసిన కారు వివరాల్లోకి వెళితే..
అందచందాలను ఆరబోయడంతో పాటు అప్పుడప్పుడు ఫైర్ బ్రాండ్ అనిపించుకునే కంగనా రానౌత్ వద్ద ఇప్పటికే ఖరీదైన కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె కార్ల గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 ఉంది. దీని ధర రూ.3.6 కోట్లు, అలాగే ఆడి క్యూ 3, బీఎం డబ్ల్యూ 7 ఉన్నాయి. వీటితో పాటు తాజాగా ‘మెర్సిడెస్ బెంజ్ జీ ఎల్ ఎస్ 600 ’ అనే మోడల్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆమె కారును సోషల్ మీడియా వ్యూయర్స్ కు పరిచయం చేసింది. లైట్ పింక్ కలర్లో ఉన్న ఈ కారును చూసి ఇంప్రెస్ అవుతున్నారు. ఇంతకీ ఈ కారు ఎలా ఉందంటే?
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8, 48 వీ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 550 బీహెచ్ పీ పవర్, 730 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పాటు డ్యూయెల్ టోన్ పెయింట్ థీమ్ కలిగి ఉంది. 22 అంగుళాల స్టాండర్ట్ అల్లాయ్ వీల్స్ ఆకర్షిస్తాయి. గంటకు 250 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లే ఈ కారు 4.9 సెకన్లలో 100 కిలో మీటర్ల వరకు దూసుకెళ్తుంది. ఈ కారు 2.43 కోట్ల వరకు ధర ఉంటుందని తెలుస్తోంది.
కంగనా రానౌత్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నుంచి పోటీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె కారు కొనుగోలు చేయడంపై ఆసక్తి రేపుతోంది.ఈ సందర్భంగా కంగనా రానౌత్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కంగనా రానౌత్ వైట్ డ్రెస్ లో ఉండగా.. ఆమె కొనుగోలు చేసి కారు లైట్ పింక్ కలర్లో అలరిస్తోంది.
View this post on Instagram