https://oktelugu.com/

Tata Tiago: మైలేజ్‌లో సూపర్‌.. సేఫ్టీలో బంపర్‌.. రూ.6 లక్షల్లో అద్భుతమైన కారు!

టాటా టియాగో కారు మార్కెట్‌లో రూ.5.65 లక్షల(ఎక్స్‌ షోరూం) నుంచి రూ.8.90 లక్షల వరకు ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌ కారు మారుతి ఆల్టో, ఎస్‌–ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్‌ ఆర్‌ వంటి కార్లతో పోటీపడుతుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 13, 2024 / 01:47 PM IST

    Tata Tiago

    Follow us on

    Tata Tiago: కరోనా తర్వాత సొంత వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన కారు.. ఇప్పుడు మధ్య తరగతి ప్రజల ఇళ్ల ముందు కూడా దర్శనమిస్తోంది. లోప్‌ లేదా అప్పు చేసి కారు కొనుగోలు చేస్తున్నారు. ఇక మధ్య తరగతి కుటుంబాలు కారు కొనేటప్పుడు మైలేజీ, పనితీరుతోపాటు భద్రత కూడా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా తెచ్చిన టాటా టియాగో కారు సేఫ్టీ విషయంలో 4 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌తోపాటు మంచి మైలేజీతో కేవలం రూ.6 లక్షల్లోనే కారును తీసుకొచ్చింది. కారు గురించి తెలుసుకుందాం.

    ప్రత్యేకతలు ఇవీ..
    టాటా టియాగో కారు మార్కెట్‌లో రూ.5.65 లక్షల(ఎక్స్‌ షోరూం) నుంచి రూ.8.90 లక్షల వరకు ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌ కారు మారుతి ఆల్టో, ఎస్‌–ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్‌ ఆర్‌ వంటి కార్లతో పోటీపడుతుంది. టాటా టియాగోలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది భద్రత పరంగా చాలా బాగుంది. అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌ కారు. ఇది GNCAP క్రాష్‌ టెస్ట్‌లో 4–స్టార్‌లను పొందింది.

    ఇంజిన్, మైలేజ్‌..
    టాటా టియాగో కారు ఇంజిన్‌ 1.2–లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగి ఉంది. ఇది 86 Bhp శక్తిని, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఈ కారు CNG ఎంపికలో కూడా వస్తుంది. ఈ ఇంజిన్ తో 5–స్పీడ్‌ మాన్యువల్, 5–స్పీడ్‌ AMT గేర్‌బాక్స్‌ ఎంపిక అందుబాటులో ఉంది. ఈ కారు భద్రతతో పాటు మంచి మైలేజీని అందిస్తుంది. కంపెనీ ప్రకారం, పెట్రోల్‌లో దాని మైలేజ్‌ 19.01kmpl. అదే సమయంలో, ఒక కిలో సీఎన్ జీతో 26.49 కి.మీల వరకు నడపవచ్చు.