Maruti Cars: దేశీయ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి సుజుకీ. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఆకట్టుకున్న మోడళ్లు మార్కెట్లో తిరుగుతున్నాయి. మారుతి సుజుకి నుంచి ఆల్టో, వ్యాగన్ ఆర్, సెలెరియో వంటి హ్యాచ్ బ్యాక్ కార్లు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇవి వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదే కంపెనీ నుంచి స్విప్ట్ సైతం హ్యాచ్ బ్యాక్ డిజైన్ తో అలరిస్తోంది. అయితే తాజాగా స్విఫ్ట్ ను అప్ గ్రేడ్ చేస్తూ మార్కెట్లోకి కొత్తగా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం దీనిని టెస్టింగ్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో దీనిని లాంచ్ చేయనున్నారు. ఈ మోడల్ విశేషాలేంటో తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న స్విప్ట్ హ్యాచ్ బ్యాక్ వెర్షన్లో ఉంది. దీనిని సీఎన్ జీ వేరియంట్ లో కూడా తీసుకొచ్చారు. ఇందులోని ZXI ని రూ.8.45 లక్సల నుంచి విక్రయిస్తున్నారు. 1.2 లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటీ ఇంజన్ ను అమర్చారు. 6,000 ఇర్ఎంపీ వద్ద 57 కెడబ్ల్యూని , 4300 ఆర్ పీఎం వద్ద 98.5 ఎన్ ఎం గరిష్ట ార్క్ ను అందిస్తుంది. ఎస్ సీఎన్ జీ వెర్షన్ ప్రామాణికంగా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో జత చేసి పనిచేస్తుంది.
కొత్త మోడల్ కు తాత్కాలికంగా మారుతి స్విప్ట్ -2024 పేరుతో డిజైన్ చేస్తున్నారు. పాత స్విఫ్ట్ తో పోలిస్తే కొత్త మోడల్ ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి రీ డిజైన్ చేయబడిన గ్రిల్ ను అమర్చారు. కొత్త ఎల్ ఈడీ మూలకాలతో స్లీకర్ హెడ్ ల్యాంప్ లు, అప్డేట్ చేయబడిన ఫ్రంట్ బంపర్, బ్లాక్ -అవుట్ ఫిల్లర్లు, వీల్ అర్జ్ లపై పాక్స్ ఎయిర్ వెంట్ లు ఉన్నాయి. ఇంజిన్ ను కూడా అప్డేట్ చేయనున్నారు.
మారుతి స్విప్ట్ 2024 ఫీచర్స్ విషయానికొస్తే 1.2 లీటర్, 3 సిలిండఱ్ పెట్రోల్ ఇంజిన్ తో కలిగి ఉంటుంది. హైబ్రిడ్ టెక్నాలజీని యూజ్ చేశారు. లీటర్ కు 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే విధంగా తయారు చేస్తున్నారు. హైబ్రిడ్ నాన్-హైబ్రిడ్ వెర్షన్ లో దాదాపు 1.50 లక్షల నుంచి 2 లక్షల వరు తేడా ఉండొచ్చని.. మొత్తంగా పాత స్విప్ట్ కంటే ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు.