Palmistry Lines: కొందరు పుట్టుకతోనే కష్టాలను మోసుకొస్తారు..మరికొందరు బంగారు చెంచను నోట్లో పెట్టుకొని జన్మిస్తారు.. ఇంకొందరు చేతిలో అదృష్టం పెట్టుకొని భూమ్మీదకు వచ్చారని అంటుంటారు. వీరిలో మూడో రకం వారి గురించి మాట్లాడితే.. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వాళ్లు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వారిని వారి చేతిలో ఉన్న గీతలను భట్టి వారు అదృష్టవంతులో..కాదో చెప్పవచ్చు. హస్తముద్రిక శాస్త్రం ప్రకారం చేతిలోని కొన్ని గీతలను భట్టి వారి తలరాతను డిసైడ్ చేయొచ్చని కొందరు జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చేతిలో ‘ఫిష్’ ఆకారం కనిపిస్తే వారి లైఫ్ లో అద్భుతాలు జరుగుతాయని చెబుతున్నారు. మరి ఇలాంటి ఫిగర్ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం.
హస్తముద్రిక జ్యోతిష్యం ప్రకారం.. అరచేతిలో కొన్ని గుర్తులు జీవితాన్ని మలుపుతిప్పుతాయట. ఈ రేఖలు ఉండే వారు అదృష్టవంతులు అని అంటున్నారు. వారు ధనవంతులు మాత్రమే కాకుండా సక్సెస్ జీవితాన్ని గడుపుతారని పేర్కొంటున్నారు. అరచేతిలో ఉండే ప్రతీ గీతకు ఓ ప్రాముఖ్యత ఉంది. కొంతమంది అరచేతిలో చేప ఆకారంలో ఉండే రేఖలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయట. పై ఫొటోలో చూపించిన విధంగా మీనం టైప్ లో రేఖ ఉండడం వల్ల వారికి అన్ని కలిసొస్తాయని అంటున్నారు. అయితే ఈ రేఖ ఎక్కడ ఉండే ఎలాంటి ఫలితాలో వస్తాయో చూద్దాం..
అయితే ఈ చేప గుర్తు చంద్ర స్థానంలో ఈ గుర్తు ఉంటే ప్రేమకలవారవుతారు. శుక్రస్థానంలో ఉంటే మంచి భార్య వస్తుంది. కుజ స్థానంలో ఉంటే యోగదాయకమైన ఉద్యోగం వస్తుంది. బుధస్థానంలో ఉంటే వ్యాపారంలో సక్సెస్ అవుతారు. మొత్తానికి మీనరేఖ ఏ స్థానంలో ఉన్నా వారికి మంచే జరుగుతుంది. ఏ విషయంలోనూ వీరు లొంగిపోకుండా ఉంటారు. ప్రతి విషయంలో విజయం సాధించడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది.
చాలా మంది అదృష్ట వంతుల్లో ఈ రేఖలు కచ్చింతగా ఉండే అవకాశం ఉంటుంది. తమ భవిష్యత్ లో ఎలాంటి పనులు చేయగలుగుతారో ఈ రేఖలను భట్టి చెప్పవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీనరేఖ మాత్రమే కాకుండా మిగతా రేఖలు కూడా వారి భవిష్యత్ ను నిర్ణయిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.