Maruti Suzuki Cars : 22 నెలల్లో 2 లక్షల అమ్మకాలు.. ఆ రికార్డును చెరిపేసిన మారుతి కారు.. ఆ వివరాలు ఇవిగో..

సాధారణంగా మార్కెట్లో మారుతి కార్లకు క్రేజ్ ఉంది. ఇందులో ఎస్ యూవీ కారు కొనాలనుకునేవారు గ్రాండ్ విటారాను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. గ్రాండ్ విటారా ను ప్రస్తుతం మార్కెట్లో రూ.10.99 లక్షల నుంచి రూ.20.09 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : July 22, 2024 12:38 pm

Maruti Suzuki Grand Vitara

Follow us on

Maruti Suzuki Cars : దేశంలోని కార్ల మార్కెట్లో మారుతి కంపెనీ నిత్యం అగ్రగామిగా నిలుస్తోంది. వినియోగదారులకు ఇంప్రెస్ చేసేలా, వారికి అనుగుణంగా వివిధ కార్లను తీసుకొచ్చి గుర్తింపు పొందుతోంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు ఎలాంటి వేరియంట్ కారు అయినా తీసుకురావడానికి మారుతి విపరీత ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని కార్లు సేల్స్ విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాయి. మారుతి నుంచి రిలీజ్ అయినా వ్యాగన్ ఆర్, స్విప్ట్ మోడళ్లు దశాబ్దాలుగా అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకుంటున్నాయి. తమకు ఎదురే లేదు అన్నట్లుగా ఇవి మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఇప్పడు మరో మోడల్ కూడా మిగతా కంపెనీల కార్లను వెనక్కి నెట్టింటి సేల్స్ రారాజుగా నిలిచింది. అదే మారుతి సుజుకీ గ్రాండ్ విటారా. దేశీయ మార్కెట్లోకి మారుతి సుజుకీ వచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది. ఈ రెండేళ్లలో ఈ కారు మొత్తం 2లక్షల యూనిట్ల విక్రయాలు ఇప్పటి వరకు ఉన్న సేల్స్ రికార్డును చెరిపేసింది. ఇప్పటి వరకు హ్యుందాయ్ ఈ రికార్డును నమోదు చేయగా ఇప్పుడు మారుతి గ్రాండ్ విటారా ఆ స్థానంలోకి వచ్చింది. అయితే మారుతి నుంచి కేవలం హ్యాచ్ బ్యాక్ కార్లు మాత్రమే కాకుండా ఎస్ యూవీ వేరియంట్లను కూడా ఆదరిస్తున్నారని ఈ సేల్స్ ను బట్టి చూస్తే అర్థమవుతోంది. అయితే మారుతి గ్రాండ్ విటారా ఎలాంటి సేల్స్ నమోదు చేసింది? ఇప్పటి వరకు ఉన్న హ్యుందాయ్ ఏ కారు రికార్డు సృష్టించింది. ఆ వివరాల్లోకి వెళితే..

మారుతి సుజుకీ గ్రాండ్ విటారాను 2022 సెప్టెంబర్ లో లాంచ్ చేశారు. ఈ కారు రిలీజ్ అయిన ఏడాదిలో 51,315 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. ఆ తరువాత సంవత్సరంలో అంటే 2024 ఒక్క ఏడాదిలో 1,21,169 యూనట్లను విక్రయించారు. మొత్తంగా 22 నెలల్లో ఈ కారు 1,99,550 కార్లను విక్రయించారు. గ్రాండ్ విటారా మార్కెట్లోకి వచ్చి రెండు సంవత్సరాల్లో 2 లక్షల మార్క్ ను టచ్ చేశాయి. అయితే ఇప్పటి వరకు హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా సైతం 2 లక్షల సేల్స్ జరిగాయి. అయితే ఇది 25 నెలల్లో సాధ్యమైంది. మారుతి గ్రాండ్ విటారా మాత్రం 22 నెలల్లో ఈ విక్రయాలు జరుపుకొని హ్యుందాయ్ రికార్డును చెరిపేసింది.

మారుతి గ్రాండ్ విటారా ప్రారంభం అయిన కొత్తలో సేల్స్ మందగించాయి. దీంతో లక్ష సేల్స్ కావడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టింది. అయితే లక్ష దాటిన తరువాత కేవలం 10 నెలల్లోనే మరో లక్ష యూనిట్ల విక్రయాలు జరిగాయి. దీంతో ఇటీవల కాలంలో ఎస్ యూవీని ఎక్కువగా ఆదరిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా మిగతా వాటి కంటే మారుతి గ్రాండ్ విటారాపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కారు సేల్స్ నమోదుతో మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటాతో పాటు వ్యోక్స్ వ్యాగన్ టైగర్, స్కోడా కుషాక్ వంటి కార్లకు గట్టి పోటీ ఏర్పడనుందని తెలుస్తోంది.

సాధారణంగా మార్కెట్లో మారుతి కార్లకు క్రేజ్ ఉంది. ఇందులో ఎస్ యూవీ కారు కొనాలనుకునేవారు గ్రాండ్ విటారాను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. గ్రాండ్ విటారా ను ప్రస్తుతం మార్కెట్లో రూ.10.99 లక్షల నుంచి రూ.20.09 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇందులో పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ కారు లీటర్ పెట్రోల్ కు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 91.18 బీహెచ్ పీ పవర్ తో పాటు 122 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.