Kalki Collections: ప్రభాస్ మూవీకి ఇండియాలో ఎదురు లేకుండా పోయింది కల్కి 2829 AD రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతుంది. విడుదలైన నాలుగో వారం కూడా కల్కి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. కల్కి 24వ రోజు వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 27న కల్కి మూవీ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి ప్రోమోలు ఆసక్తి రేపాయి. ముఖ్యంగా రెండు ట్రైలర్స్ అంచనాలు పెంచేశాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో కల్కి మూవీ ఉంది.
మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న కల్కి వసూళ్లు అదే స్థాయిలో ఉన్నాయి. డొమెస్టిక్, ఓవర్సీస్ మార్కెట్స్ ని కల్కి కొల్లగొట్టింది. విదేశాల్లో కల్కి చిత్రానికి మరింత ఆదరణ దక్కడం విశేషం. కల్కి మొదటి వారం ఇండియాలో రూ. 450 కోట్లు వసూలు చేసింది. తెలుగులో రూ. 223 కోట్లు, తమిళంలో రూ. 23 కోట్లు, హిందీలో రూ. 163 కోట్లు, మలయాళంలో రూ. 14 కోట్లు రాబట్టింది. ఇక రెండవ వారం కూడా కల్కి జోరు కొనసాగింది. ఇండియా వైడ్ రూ. 140 కోట్లు రాబట్టింది. మూడో వారం మరో రూ. 60 కోట్ల వసూళ్లను అందుకుంది.
నాలుగో వారం కల్కి వసూళ్లు పరిశీలిస్తే… 23వ ఆరోజు 3 కోట్లు రాబట్టింది. 24వ రోజు రికార్డు స్థాయిలో రూ. 6 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా 24 రోజులకు ఇండియాలో రూ. 610 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 900 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. రూ. 1080 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కి కల్కి చేరుకుంది. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 370 నుండి 380 కోట్ల మధ్య ఉంది. ఈ క్రమంలో కల్కి భారీ లాభాలు పంచింది.
కల్కి చిత్రానికి బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడం కూడా కలిసి వచ్చింది. జులై 12న విడుదలైన భారతీయుడు 2 నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో కల్కి వసూళ్లు ఇంకా మెరుగయ్యాయి. నాలుగో వారం ముగిసే నాటికి కల్కి మరిన్ని వసూళ్లు రాబట్టే సూచనలు కలవు.
కల్కి కథ విషయానికి వస్తే.. యాస్కిన్(కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే ఆకాశ నగరాన్ని సృష్టించి నీరు, సంపద , వనరులు అక్కడ భద్రపరుస్తాడు. కాంప్లెక్స్ లో విలాసవంతమైన జీవితం గడపాలి అంటే… మిలియన్స్ కొద్దీ యూనిట్స్(డబ్బులు) కావాలి. ఆ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లో సెటిల్ అవ్వాలనేది భైరవ(ప్రభాస్) కల. దానికోసం ఎలాంటి పనైనా చేస్తాడు. యాస్మిన్ కి తల్లి గర్భంలో ఉన్న శిశువు నుండి తీసే సిరం కావాలి. అందుకు అమ్మాయిల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఒక్క మహిళ గర్భం కూడా 100 రోజులకు మించి నిలబడదు.
సుమతి(దీపికా పదుకొనె) గర్భంలో ఉన్న శిశువు సిరంతో యాస్మిన్ కోరుకున్నది చేయగలడు. కానీ కాంప్లెక్స్ నుండి సుమతి పారిపోతుంది. సుమతి కోసం యాస్మిన్ మనుషులు, భైరవ వెతుకుతూ ఉంటారు. సుమతిని యాస్మిన్ మనుషులకు అప్పగిస్తే మిలియన్ల కొద్దీ యూనిట్స్ వస్తాయి. అయితే సుమతికి రక్షణగా అశ్వద్ధామ(అమితాబ్) ఉంటాడు. ఈ క్రమంలో భైరవ-అశ్వద్ధామ మధ్య పోరు నడుస్తుంది. మరి భైరవ సుమతిని పట్టుకున్నాడా? యాస్మిన్ మనుషులకు సుమతిని అప్పగించాడా? కాంప్లెక్స్ కి వెళ్లాలన్న భైరవ కల నెరవేరిందా? అసలు భైరవ ఎవరు? అనేది మిగతా కథ..