https://oktelugu.com/

Maruti Suzuki: మారుతి సుజుకీ వెలాసిటీ కొత్త ఎడిషన్ రిలీజ్.. రూ.17,378కే..

Maruti Suzuki: మారుతి ఫ్రంక్స్ వెలాసిటీ స్పెషల్ ఎడిషన్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ను కలిగి ఉంది. ఇది 1.2 లీటర్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో సహా మొత్తం 14 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 29, 2024 / 01:00 PM IST

    Maruti Suzuki Fronx Velocity Edition

    Follow us on

    Maruti Suzuki: SUVకార్లను ఉత్పత్తి చేయడంలో మారుతి కంపెనీ సైతం ముందుంటుంది. ఇందులో భాగంగా కొత్తగా సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ ఫ్రంట్ క్స్ కొత్త వెలాసిటీని విడుదల చేసింది. ప్రస్తుతం కాలంలో కారు వినియోగదారులు ఎస్ యూవీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో మారుతి రిలీజ్ చేసిన వెలాసిటీపై మక్కువ పెరిగింది. దీంతో ఇది మార్కెట్లోకి వచ్చిన 10 నెలల్లోనే లక్ష యూనిట్లు అమ్ముడు పోయాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఫ్రాంక్ స్పెషల్ ఎడిషన్ ను తీసుకొచ్చింది. దీని ఫీచర్లు, ధర ఏ విధంగా ఉందో చూద్దాం..

    మారుతి ఫ్రంక్స్ వెలాసిటీ స్పెషల్ ఎడిషన్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ను కలిగి ఉంది. ఇది 1.2 లీటర్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో సహా మొత్తం 14 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రత్యేక ఎడిషన్ సీఎన్ జీ ఆప్షన్ లోనూ అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ లో 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ ను ఉంది. ఇది 89.7 బీహెచ్ పీ పవర్ తో పాటు 98.5 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో ఉన్న ఇది 28.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    కొత్ ఎడిషన్ స్పోర్ట్స్ కారు మోడల్ ను కలిగి ఉంది. ఇందులో బంపర్ గార్నిష్, హెడ్ ల్యాంప్ గార్నిష్, వీల్ ఆర్చ్ గార్నిష్, రెడ్ యాక్సెంట్ తో పాటు ఫ్రంట్ గ్రిల్, బాడీ సైడ్ మౌల్డింగ్ష్ , ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ గార్డ్ లు ఉన్నాయి. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ ను కలిగిన ఇది గ్రే, రెడ్ కాంబినేషన్ స్టైలింగ్ కిట్ ఉండనుంది. ఇదో యాక్సెసరైడ్జ్ వెర్షన్. ఈ మోడల్ ను రూ.7.29 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    వెలాసిటీ ప్రీమియం సబ్ కాంపాక్ట్ కొత్త ఎడిషన్ ను రూ. 17,378 నెలవారి వాయిదా పద్దతి ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ మోడల్ ఇండియాలో ఇప్పటికే ఉన్న టయోటా అర్బన్ క్రూయిజర్ టేజర్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా XUV3X0 వంటి వాహనాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది మొత్తం 14 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.