Homeఎంటర్టైన్మెంట్Telugu Heroine: తలెత్తి గర్వంగా చూస్తున్న ఈ పాప.. తెలుగులో పాపులర్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Telugu Heroine: తలెత్తి గర్వంగా చూస్తున్న ఈ పాప.. తెలుగులో పాపులర్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Telugu Heroine: మలయాళం ఇండస్ట్రీ నుంచి తెలుగు పరిశ్రమలోకి ఎంతో మంది భామలు వచ్చి సెటిల్ అయ్యారు. కొందరు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. వీరి కోవలోనే తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఓ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయింది. మలయాళ అమ్మాయి అయినా.. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉన్న ఈమె ఈ సినిమా తరువాత చాలా తక్కువ సినిమాల్లో కనిపించింది. ఓ వివాదంలో చిక్కుకుని ఆ తరువాత బయటపడింది. చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నిర్మాతను పెళ్లిచేసుకున్న ఈమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇంతలో ఆమెకు సంబంధించిన చిన్న నాటి పిక్ ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

ఫ్యామిలీ చిత్రాలను తీయడంతో కృష్ణవంశీకి మించిన వాళ్లు లేరు. ఆయన సినిమాల ద్వారా ఎంతో మంది హీరోయిన్లు గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కృష్ణ వంశీ అప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలు తీసి ఒక్కసారిగా సమాజంలో జరిగే పరిస్థితులపై చిత్రాన్ని తీశారు. అదే ‘మహాత్మ’. మహాత్మ గాంధీ సాధించిన భారత దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే కోణంలో వచ్చిన ఈ మూవీలో శ్రీకాంత్ హీరోగా నటించారు. ఈయనకు అందాల భామ జోడీగా ఉన్నారు. అమెనే భావన మీనన్.

మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించిన భావన.. తెలుగులో మహాత్మ సినిమాతో పరిచయం అయింది. ఈ సినిమాలో అమాయకపు అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది. ఆ తరువాత గోపీచంద్ తో కలిసి ఓ సినిమాలో కనిపించింది. అయితే తెలుగులో సినిమాలు తగ్గిపోవడంతో తిరిగి మలయాళం ఇండస్ట్రీకి వెళ్లిన ఆమెకు ఆఫర్స్ తెగ వచ్చాయి. దీంతో ఆమె అక్కడ సినిమాలతో బీజీగా మారింది. అయితే సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఆమె కిడ్నాప్ నకు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత 2018లో భావన నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది.

కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె తిరిగి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. లేటేస్టుగా మలయాళంలో ‘నుడిగర్’ అనే సినిమాలో నటించింది. తెలుగులో అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఆమె జిమ్ చేస్తూ.. ఫ్రెండ్స్ తో ఉన్న పిక్స్ వైరల్ గా మారాయి. అయితే సినిమాల్లో నటించనప్పటి కంటే ఇప్పుడే భావన అందంగా తయారయ్యారు. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన చిన్న నాటి ఫొటో అలరిస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version