Hyundai Car: హ్యుందాయ్ క్రెటా EV.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎంత మైలేజో తెలుసా?

2024 డిసెంబర్ వరకు మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తున్న క్రెటా ఈవీ గురించి వివరాల్లోకి వెళితే..

Written By: Srinivas, Updated On : March 19, 2024 5:10 pm

Hyundai car

Follow us on

Hyundai Car: దేశంలో కార్ల ఉత్పత్తిలో హ్యుందాయ్ తనకంటూ ప్రత్యేకత చాటుకుంది. ఇప్పటి వరకు SUV కార్లను తీసుకొచ్చిన ఈ కంపెనీ ఇప్పుడు EVలను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయిన క్రెటా గురించి అందరికీ తెలిసిందే. దీనిని ఇప్పుడు ఈవీగా మార్చి మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే దీనిని టెస్టింగ్ నిర్వహించారు. 2024 డిసెంబర్ వరకు మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తున్న క్రెటా ఈవీ గురించి వివరాల్లోకి వెళితే..

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ మోడల్ లో పనిచేస్తుంది. ఇందులో 5560kWh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 450 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. 2 అడాస్ సూట్ తో అమర్చబడిన దీని ICE వేరియంట్కి చాలా పోలిక ఉంటుంది. కారు బంపర్ కు అమర్చబడిన రేడియేటర్ గ్రిల్ తో పాటు మరో దానిని సెట్ చేశారు. ఫ్రంట్ ఫెండర్ పై ఛార్జింగ్ పోర్టు ఉండనుంది. హ్యుందాయ్ కొత్త క్రెటాలో ఎలక్ట్రిక్ మోడల్ లోని ఇంటర్ ఫేస్ ను కలిగి ఉంటుంది.దీనికి 360 డిగ్రీ కెమెరాను అమర్చనున్నారు.

హ్యుందాయ్ క్రెటా డిజైన్ ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువ. ఇది క్లోజ్డ్ ప్యానెల్ ను కలిగి ఉంటుంది. అయితే ఫేస్ లిప్ట్ లో సాంప్రదాయ గ్రిల్ రేడియేటర్ ను అమర్చనున్నారు. ఇందులో ఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ లు వంటి అంశాలు ఇందులో కనిపిస్తాయి. ఇందులో 17 అంగుళాల ఏరో డిజైన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వీటిని ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ కారు మార్కెట్లోకి వస్తే రూ.20 లక్షల పైగానే ఉండొచ్చని భావిస్తున్నారు.