Homeబిజినెస్Maruti Suzuki Brezza: పదేళ్లలో 14 లక్షల కార్ల విక్రయాలు..SUV అంటే ఇదే అంటున్న కస్టమర్లు..

Maruti Suzuki Brezza: పదేళ్లలో 14 లక్షల కార్ల విక్రయాలు..SUV అంటే ఇదే అంటున్న కస్టమర్లు..

Maruti Suzuki Brezza: Maruti Suzuki కంపెనీ కార్లు దేశంలో ఎప్పటికీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతాయి. ఈ కంపెనీ నుంచి దశాబ్దాల కిందట వచ్చిన కార్లు ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. సెడాన్ నుంచి లగ్జరీ కార్ల వరకు వినియోగదారులకు అనుగుణంగా ఈ కంపెనీ కార్లను ప్రత్యేకంగా తయారు చేసి మార్కెట్లోకి తీసుకువస్తుంది. అయితే 2016 సంవత్సరంలో మారుతి సుజుకి నుంచి విటారా బ్రెజ్జా మార్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇది పలు మార్పులు చేసుకొని నేటి తరానికి అనుగుణంగా అందుబాటులో ఉంది. ఇది మార్కెట్లోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ సందర్భంగా దీని అమ్మకాలు 14 లక్షల మైలురాయిని దాటింది. అయితే అప్పటి నుంచి ఈ Brezza ఇలాంటి అమ్మకాలు నమోదు చేసుకుందో ఇప్పుడు చూద్దాం..

Maruti Suzuki Brezza మార్కెట్లోకి వచ్చిన కొత్తలో SUV కార్ల హవా కొనసాగుతోంది. దీంతో ఇది కూడా SUV కావడంతో దీని అమ్మకాలు పెరగడానికి సహాయపడింది. మొదట్లో వచ్చినప్పుడు ఈ కారు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ తో నడిచేది. ఆ తర్వాత 2020 సంవత్సరంలో డీజిల్ ఇంజన్ కారు ఉత్పత్తిని నిలిపివేశారు. అంతేకాకుండా విటారా బ్రెజ్జా కాకుండా కేవలం Brezza మాత్రమే తయారు చేస్తూ దీనిని పెట్రోల్ పవర్ ట్రెయిన్ గా మార్చారు. 2022 నుంచి ఈ కారు ఈ రకమైన ఇంజన్తో కొనసాగుతూ వస్తుంది. అప్పుడు 1.5 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పనిచేసినప్పుడు 20.15 కిలోమీటర్ల మైలేజ్ నీ అందించింది. అయితే ఆ తర్వాత దీనిని 6 ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తూ 19.80 కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ కారులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లను చేర్చారు. ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ సన్ రూమ్, మొబైల్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. అలాగే సేఫ్టీని అందించే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ISOFIX యాంకర్స్, ESP, హిల్ హోల్డ్ అసిస్టు కూడా పనిచేస్తుంది.

Also Read: ఇక మీరు Nissan కొత్త కారు కొనవచ్చు.. ధర రూ.6 లక్షల లోపే..

మారుతి సుజుకి brezza మార్కెట్లోకి వచ్చిన 8 నెలల్లో లక్ష యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది. ఆ తర్వాత 2020లో 5 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయి దాటింది. 2023లో 10 లక్షల కార్లు విక్రయించి మిలియన్ మార్క్ ను అధిగమించింది. అంతేకాకుండా 2023 సంవత్సరంలో అత్యధికంగా విక్రయాలు జరుపుకున్న SUV కారు గా నిలిచింది. ఈ విధంగా గత పదేళ్లలో ఈ కారు 14 లక్షల కార్లను విక్రయించింది. ప్రస్తుతం ఈ కారును రూ.9.89 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. SUV వేరియంట్ లో అతి తక్కువ ధరతో ఉండడంతో చాలామంది దీని వైపే చూస్తున్నారు.

S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News