Mamunuru Airport opening date: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే ప్రఖ్యాతి పొందింది. అయితే ఇప్పుడు తెలంగాణలోని మరో ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో మరోసారి విమాన రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. వరంగల్ జిల్లా మూమునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి సాంకేతిక సహాయం అందించేందుకు వరంగల్ నీట్ కు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయగా.. తదుపరి చర్యల్లో భాగంగా సాంకేతిక సహాయం తో పాటు సూపర్వైజింగ్ చేయాలని ప్రభుత్వం నీట్ ను కోరింది. దీంతో ఈ ఎయిర్పోర్ట్ పై ఇప్పుడు ఆసక్తిగా చర్చ సాగుతోంది.
వరంగల్ జిల్లాలోని మూమునూరు లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి రూ. 850 కోట్లు అవసరం ఉండనుంది. ఇందులో ఆధునిక టెర్మినల్ భవనానికి, రహదారి ఏర్పాట్లకు, ట్రాఫిక్ కంట్రోల్ తో పాటు ఫైర్ సేఫ్టీ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 2027 చివరి నాటికి ఈ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో వరంగల్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని కొందరు అంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఐటీ సెక్టార్ ఎదిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఇక్కడ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: ఊరికి రూ.10 వేలు.. పట్టణానికి రూ.2 లక్షలు.. ఇక నిధులే నిధులు
అలాగే ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు కావడంతో ఇది అంతర్జాతీయంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలోని ఎయిర్పోర్ట్ ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే 1930 లా కాలంలో ఈ ఎయిర్ పోర్టును ప్రారంభించారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పై అజాం జాహి మిల్స్ వంటి పరిశ్రమల సహాయంగా దీనిని ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం 1948 ఆపరేషన్ పోలో లో భాగంగా ఉపయోగించారు. 1959లో జవహర్లాల్ నెహ్రూ కూడా ఇక్కడ దిగినట్లు చరిత్ర తెలుపుతుంది. ఈ ఎయిర్పోర్టు పునరుద్ధరణకు 2025లో కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 950 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ఎయిర్పోర్టులో దేశీయ విమాన సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.