https://oktelugu.com/

Maruthi EVX : మారుతి eVX ఫొటోస్ లీక్.. సిద్ధమవుతున్న ఎలక్ట్రిక్ కారు…ఫీచర్స్, ధర ఎలా ఉన్నాయంటే?

దేశంలో మారుతి కంపెనీ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటి వరకు వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి సందడి చేశాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్ల కార్లు వినియోగదారుల మనసును దోచుకున్నాయి. అయితే ఇప్పుడు మారుతి విద్యుత్ కార్లను కూడా తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. మారుతి eVX పేరుతో కారును ఉత్పత్తి చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 19, 2024 / 10:51 AM IST
    Follow us on

    Maruthi EVX :  ఆటోమోబైల్ రంగంలో ప్రస్తుతం ఈవీల జోరు కొనసాగుతోంది. చాలా కార్ల కంపెనీలు పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు మార్కెట్లో ఈవీలను ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకర్షించాయి. ఇప్పుడు మరికొన్ని ఈవీలు రావడానికి రెడీ అవుతున్నాయి. వీటిలో మారుతికి చెందిన ఎలక్ట్రిక్ కారు ఒకటి. మారుతి నుంచి విద్యుత్ కారు వస్తుందన్న సమాచారం ఎప్పుడో బయటకు వచ్చింది. కానీ ఈ మోడల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి? అనేది చాలా మందికి తెలుసుకోవాలన్న ఉత్సాహ ఉండేది. ఇప్పటి వరకు దీనిపై ఊహాగానాలే వచ్చాయి. కానీ లేటేస్టుగా మారుతి ఈవీ గురించి కొంత సమాచారం లీక్ అయింది. ఆ వివరాల్లకి వెళితే..

    దేశంలో మారుతి కంపెనీ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటి వరకు వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి సందడి చేశాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్ల కార్లు వినియోగదారుల మనసును దోచుకున్నాయి. అయితే ఇప్పుడు మారుతి విద్యుత్ కార్లను కూడా తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. మారుతి eVX పేరుతో కారును ఉత్పత్తి చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కానీ దీని గురించి వివరాలు అధికారికంగా ప్రకటించలేదు. అయితే లేటేస్టుగా ఈ కారుకు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ ఫొటోలను చూస్తే టాటా కంపెనీకి చెందిన పంచ్ కు గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

    టాటా కంపెనీకి చెందిన ఈవీ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి హవా కొనసాగిస్తోంది. టాటా పంచ్ లో 25 నుంచి 35 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 3145 నుంచి 421 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. చార్జింగ్ సమయం 3 నుంచి 4 గంటలు పడుతుంది. 5 డోర్లు కలిగిన ఈ కారు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అయితే తాజాగా రిలీజ్ అయిన ఫొటోలను చూస్తే మారుతి eVX.. టాటా పంచ్ కు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు.

    మారుతి eVX లో 60 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. దీనిని ఒక్కచారి ఛార్జింగ్ చేస్తే 550 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అంటున్నారు. ఇక ఇందులో ఉండే ఫీచర్స్ పై కూడా అంచనా వేస్తున్నారు. ఇందులో ఎల్ ఈడీ డీఆర్ఎల్ హెడ్ ల్యాంప్స్ ఉండనున్నాయి. ఎల్ ఆకారపు డిజైన్ ను కలిగి ఉంటుంది. ఎల్ ఈడీ టెయిల్ టైల్ ఉండనుంది. ఇందులో సేప్టీ ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. మారుతి eVX లో 360 డిగ్రీ కెమెరా, రోటరీ డయల్, సి పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండి్సల్, డ్యూయెల్ టోన్ వాటితో పాటు లేటేస్ట్ లెక్నాలజీ ఫీచర్స్ ఉంటాయంటున్నారు.

    2025 నాటికి ఈ కారు మార్కెట్లోకి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే దీనిని క్రాస్ టెస్టింగ్ చేవారు. ఇదొక మిడ్ సైజ్ SUV అని పేర్కొంటున్నారు. దీంతో ఎస్ యూవీ కారు కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. మార్కట్లోకి వచ్చిన తరుణంలో టాటా పంచ్ తో పాటు హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే దీని ధరపై తీవ్రంగా చర్చ సాగుతోంది. కొందరు మారుతి ఈవీ ధర ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. కానీ కొందరు నిపుణులు మాత్రం దీనిని రూ.8 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే బడ్జెట్ లో కారు వస్తే డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.