Nissan’s new X-Trail : కారు కొనాలనుకునే వారిలో విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. కొందరు సింపుల్ గా తమ అవసరాల కోసం హ్యాచ్ బ్యాక్ కారు ఉంటే చాలనుకుంటున్నారు. మరికొందరు ఎస్ యూవీ కారు కావాలని అనుకుంటారు. కానీ కొందరు మాత్రం ఖరీదైన కార్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మార్కెట్లోకి లగ్జరీ కారు ఏది వచ్చినా దానిన సొంతం చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఖరీదైన కార్లను ఉత్పత్తి చేస్తుంటాయి. లేటేస్టుగా నిస్సాన్ కంపెనీ ఓ కారును సీబీయూ ద్వారా భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. SUV వేరియంట్ లో ఉన్న ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
నిస్సాన్ కార్ల కంపెనీ నుంచి ప్రస్తుతం కాంపాక్ట్ మాగ్నైట్ కారు మాత్రమే మార్కెట్లో ఉంది. ఇది రిలీజ్ చాన్నాళ్లే అవుతంది. ఇప్పుడు నిస్సాన్ సరికొత్త రోల్ మోడల్ కారును మార్కెట్లోకి తీసుకొస్తుంది. అదే 4వ తరం ‘X -Trail’ . ఎక్స్ ట్రైల్ సీఎంఎఫ్ -సీ ప్లాట్ ఫాం పై రూపొందించబడింది. దీనిని ఇప్పటికే 2021లో రిలీజ్ చేశారు. 5, 7 సీట్ల తో ఉన్న ఈ కారు దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది స్ప్లిట్ హెడ్ ల్యాంప్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ర్యాంప్ రౌండ్ ఎల్ ఈడీ టైల్ లైట్స్ తో ఆకర్షిస్తోంది.
ఇప్పుడు ఈ కారు 4వ జనరేషన్ ను మార్కెట్లోకి తీసుకు రావడానికి రెడీ అవుతున్నారు. కొత్త ఎక్స్ ట్రైల్ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ కలర్లలో లభించనుంది. ఈ కారు 4680 మిల్లి మీటర్ల పొడవు, 1840 మిల్లీ మిటర్ల వెడల్పు ఉండనుంది. ఈ కారు ఫీచర్స్ గురించి తెలిసి వినియోగదారులు ఇంప్రెస్ అవుతున్నారు. పాత నిస్సాన్ కంటే ఇందులో అధునాతన ఫీచర్స్ ను అమర్చారు. నేటి వినియోగదారులకు అనుగుణంగా ఇవి పనిచేయనున్నాయి.
కొత్త ఎక్స్ ట్రైల్ లో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ తో 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఇందులో వైర్ లెస్ ఛార్జర్, ఆటో హోల్డ్ ఫంక్షన్ తో పాటు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేప్టీ విషయంలో ఈ కారు బెస్ట్ అంటున్నారు. ఇందులో 360 డిగ్రీ కెమెరా, ప్యాడిల్ షిప్టర్ వంటివి ఉన్నాయి. అలాగే 7 ఎయిర్ బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో వైపర్స్, లిమిటెడ్ స్లిప్ డిప్ వంటివి ఉన్నాయి.
దేశీయ మార్కెట్లోకి రాబోతున్న ఈ కారు ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో 1.5 మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. 163 బీహెచ్ పీ పవర్ వద్ద 300 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ కారు 12 వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ను పొందనుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగిన ఈ కారు డ్రైవర్లకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు. లేటేస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో పాటు బాహుబలి లాంటి ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ కారును రూ.40 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే స్కోడా కొడియాక్, ఎంజీ గ్లోస్టర్ కు గట్టిపోటీ ఇస్తుందని అంటున్నారు. అయితే ఈ కారును ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు.