Maruti e-Vitara : మారుతి సుజుకి దేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి రెడీ అవుతుంది. ఇది గ్రాండ్ విటారా ఎలక్ట్రిక్ అవతార్. దీనికి ఈ-విటారా అని పేరు పెట్టారు. మీడియా కథనాల ప్రకారం.. ఈ కారు దేశంలోని వివిధ డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభించింది. మారుతి త్వరలోనే దీని విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. అనేక చోట్ల ఈ ఎలక్ట్రిక్ SUVని నెక్సా షోరూమ్‌లలో ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, కొన్ని షోరూమ్‌లలో ఈ ఎలక్ట్రిక్ SUV కోసం అనధికారిక ప్రీ-బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. విడుదలైన తర్వాత ఈ-విటారా నేరుగా ఈ విభాగంలోని ఇతర ఎలక్ట్రిక్ SUVలైన క్రెటా ఈవీ, కర్వ్ ఈవీలకు గట్టి పోటీనిస్తుంది. ఈ SUV డిజైన్ విషయానికి వస్తే ఇది దాని ICE వెర్షన్‌ను పోలి ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ కావడంతో కొన్ని డిజైన్ అంశాలు భిన్నంగా ఉంటాయి.
డిజైన్
ఈ-విటారా వైపు నుంచి చూస్తే, అద్భుతమైన వీల్ ఆర్చీలు, C-పిల్లర్ లోపల ఇంటిగ్రేటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంది. 18-ఇంచుల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. టెయిల్‌గేట్‌పై సిల్వర్-ఫినిష్డ్ సుజుకి లోగో, ఈ-విటారా బ్యాడ్జింగ్‌తో హైలైట్ చేయబడింది. మారుతి ఈ-విటారా 10రంగుల్లో లభిస్తుంది. ఇందులో 6 మోనో-టోన్, 4 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లు ఉంటాయి. ఇది Y-ఆకారపు LED డే-టైమ్ రన్నింగ్ లైట్‌తో బోల్డ్ ఫ్రంట్‌ను కలిగి ఉంది. ఇది హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌కు అనుసంధానించబడి ఉంది. ఇందులో బిల్ట్-ఇన్ ఫాగ్ ల్యాంప్‌లతో ఆకర్షణీయమైన ఫ్రంట్ బంపర్, స్లీక్ పెద్ద LED టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి.
ఈ-విటారా రేంజ్
ఈ-విటారాను మారుతి టయోటాతో కలిసి అభివృద్ధి చేసిన సరికొత్త హార్టెక్ట్-ఈ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. ఇది పూర్తిగా కొత్త , అధునాతన ప్లాట్‌ఫారమ్. ఈ కారు లిథియం-అయాన్-ఫాస్ఫేట్ బ్యాటరీ టెక్నాలజీతో వస్తుంది. మొత్తంమీద ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా అద్భుతమైన పవర్, యాక్సిలరేషన్‌ను చూడవచ్చు. ఈ-విటారా రెండు బ్యాటరీ ప్యాక్‌లలో అందుబాటులో ఉంటుంది, అవి 49 kWh, 61 kWh. 49 kWh వేరియంట్ 2WD కాగా, 61 kWh వేరియంట్ 2WD (సింగిల్-మోటర్), AWD (డ్యూయల్-మోటర్) రెండింటిలోనూ ఎంపికను కలిగి ఉంది. మారుతి సుజుకి ఈ-విటారా ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిమీ వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు.
ఈ-విటారాలో ఫీచర్లు ఎలా ఉంటాయి
ఈ-విటారా లోపలి భాగం స్టైలిష్ డ్యూయల్-టోన్ క్యాబిన్‌ను కలిగి ఉంది. స్లీక్ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, పెద్ద ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, కంప్లీట్ డిజిటల్ డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో నిండి ఉంది. ఇందులో క్లైమేట్ కంట్రోల్, రోటరీ వాల్యూమ్ నాబ్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సెలెక్టబుల్ డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఆల్‌గ్రిప్-ఈ వేరియంట్‌లో ట్రైల్ మోడ్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు సేఫ్టీ కోసం ఈ ఎలక్ట్రిక్ SUVలో ADAS ఫీచర్లు, ఎయిర్ బ్యాగ్స్ కూడా లభిస్తాయి.
Also Read : త్వరలో భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు..మంత్రి సంచలన ప్రకటన