Puri Jagannadh : సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంటుంది. వీలైతే సినిమాలు చూడాలని కుదిరితే సినిమాలను డైరెక్ట్ చేయాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అయితే కొందరికి మాత్రమే సినిమాలు చేసే అవకాశం వస్తుంది. ఇక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవారు డైరెక్టర్లుగా స్టార్ డైరెక్టర్లు అవుతుంటే ఉపయోగించుకొని వారు మాత్రం భారీగా డౌన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే రావచ్చు…
సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh)… ప్రస్తుతం విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి బెగ్గర్ (Beggar) అనే టైటిల్ తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఏంటి ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పటికీ ఆ కథని నమ్మి విజయ్ సేతుపతి ఎందుకు ఈ సినిమా చేస్తున్నాడు. తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడా? ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కి ఒకప్పుడు మంచి గుర్తింపైతే ఉండేది. కానీ వరుసగా ఫెయిల్యూర్స్ ని మూట గట్టుకుంటున్న ఆయనకి స్టార్ హీరోలెవ్వరు అవకాశాలు అయితే ఇవ్వడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో విజయ్ సేతుపతి ఇచ్చిన అవకాశాన్ని పూరి ఎంతవరకు యూజ్ చేసుకుంటాడు. తద్వారా ఈ సినిమాలతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక పూరి మరోసారి ఈ సినిమాను చాలా తక్కువ రోజుల్లోనే షూట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీని మూడు నెలల్లో ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో పూరి జగన్నాథ్ ఉన్నాడట. మరితను అనుకున్నట్టుగానే ఈ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నప్పటికి మేకింగ్ మాత్రం చాలా ఫాస్ట్ గా చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడట.
Also Read : హీరోయిన్ ఛార్మి తో రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టిన పూరి జగన్నాథ్..కారణం ఏమిటంటే!
మరి తను అనుకున్నట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తాడా? తద్వారా ఇంతకుముందు ఉన్న గుర్తింపును మరోసారి సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడా లేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఇక ప్రస్తుతానికైతే విజయ్ సేతుపతి లాంటి నటుడు ఆయన సినిమాలో చేస్తున్నాడు అనే వార్త విన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయినప్పటికి ప్రస్తుతం ఆయన మంచి ఫామ్ లో అయితే లేడు. అలాగే తన మార్కెట్ కూడా భారీగా డౌన్ అయింది. విజయ్ తనతో సినిమా చేయడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక పూరి జగన్నాథ్ అతనికి ఎలాంటి కథ చెప్పి ఒప్పించాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఎలా కనిపించబోతున్నాడు తద్వారా ఆయన సినిమాలతో ప్రేక్షకుల్ని మరోసారి మెప్పించే ప్రయత్నం చేస్తాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ ల వల్లే స్టార్ హీరోలుగా మారి వాళ్ళకే హ్యాండ్ ఇచ్చిన హీరోలు…