
మారుతీ సుజుకీ కొత్త కారును కొనుగోలు చేసేవాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇతర కంపెనీలతో పోల్చి చూస్తే తక్కువ ధరలకే మారుతి సుజుకీ కార్లను విక్రయిస్తోంది. మారుతీ సుజుకీ సెలెరియో కారును కేవలం రోజుకు 200 రూపాయలు పొదుపు చేస్తే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ కారు ధర 4,41,000 రూపాయలు కాగా కారు కొనుగోలు కోసం 25,000 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: ఎస్బీఐని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమేమిటంటే?
ఎక్స్ షోరూమ్ ధర 4,41,000 రూపాయలు కాగా టాప్ వేరియంట్ ధర 5,68,000 రూపాయలుగా ఉంది. ఈ కారును కొనుగోలు చేయాలని అనుకునే వారు డౌన్ పేమెంట్ చెల్లించిన తరువాత నెలకు 6,487 రూపాయల చొప్పున 8 శాతం వడ్డీతో ఏడు సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది. నెలకు 6,487 రూపాయలు అంటే రోజుకు 220 రూపాయలు ఆదా చేయడం ద్వారా సులభంగా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
Also Read: రైల్వేస్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?
ఎవరైనే ఈ.ఎం.ఐ భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తే మాత్రం ఎక్కువ మొత్తం డౌన్ పేమెంట్ చెల్లించడం ద్వారా సులభంగా భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. లోన్ టెన్యూర్ ను ఎంచుకునే సమయంలో మన ఆదాయం, ఖర్చులను బట్టి ఎంచుకుంటే ప్రయోజనం ఉంటుంది. 35 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీ ఉండే ఈ కారులో ఐదు మంది కూర్చునే అవకాశం ఉంటుంది.
మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము
998 సీసీ ఇంజిన్ తో పని చేసే ఈ కారులో అత్యాధునిక ఫీచర్లు చాలానే ఉన్నాయి. తక్కువ ధరకే కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ కారును కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.