https://oktelugu.com/

మారుతి నుంచి ఈ కారు అప్డేట్.. ఎగబడుతున్న జనం..

మారుతి నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన కార్లలో కాంపాక్ట్ ఎస్ యూవీ కారు బ్రెజ్జా. ఈ మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 10, 2024 / 04:11 PM IST

    Maruthi Brezza

    Follow us on

    మారుతి కార్లంటే ఎవరికైనా క్రేజీ ఫీలింగ్ ఉంటుంది. సరసమైన ధరల్లో మంచి ఫీచర్స్ కలిగిన ఈ కంపెనీ కారును దక్కించుకోవాలని చాలా మంది చూస్తారు. మే 9న మారుతి స్విప్ట్ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కారుపై చర్చ జరుగుతున్న తరుణంలో ఇదే కంపెనీకి చెందిన మరో కారు అప్డేట్ ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది.లో బడ్జెట్ తో పాటు అధునాతన ఫీచర్స్ కలిగిన ఈ కారు కోసం జనం ఎగబడుతున్నారు. ఇంతకీ ఇది ఏ కారు? అందులో అప్డేట్ చేసిన ఫీచర్స్ ఏంటీ?

    మారుతి నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన కార్లలో కాంపాక్ట్ ఎస్ యూవీ కారు బ్రెజ్జా. ఈ మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 102 బీహెచ్ పీ పవర్ తో 137 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లోనూ అందుబాటులో ఉంది. బ్రెజ్జా కారు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది. అలాగే 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది.

    బ్రెజ్జా కారు కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. బ్రెజ్జా LXi, VXi, ZXi వేరియంట్లలో లభిస్తుంది. అయితే వీటిలో లేటేస్ట్ గా స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ లను అమర్చారు. ఈ రెండు ఫీచర్లు గతంలో పెట్రోల్ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు సీఎన్ జీ వెర్షన్లలో లభిస్తుంది. అయితే బ్రెజ్జా సీఎన్ జీలో మార్పులు చోటు చేసుకున్నా.. ధర మాత్రం అలాగే ఉంది. ప్రస్తుతం బ్రెజ్జాను రూ.8.34 లక్షల నుంచి రూ.14.4 లక్షల వరకు విక్రయిస్తున్నారు.