Nara Lokesh Love Story: చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ప్రస్తుతం రాజకీయాల్లో చాలా చురుక్కుగా ఉంటున్నాడు. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్నారు నారా లోకేష్. ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. యువగళంలో భాగంగా లోకేష్ కొంత కాలం క్రితం సొంత నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించారు.
అక్కడ నారా లోకేష్ విద్యార్థులు యువతతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు దగ్గర అయ్యారు. అయితే వారి వివాహాని కంటే ముందు ఎవరు ప్రపోజ్ చేశారని దాని తర్వాత లోకేష్ ఎలా స్పందించారు అంటూ అడిగింది ఓ యువతి. ఇదెలా ఉంటే నారా లోకేష్ మంగళగిరిలో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులు యువతతో ఆగస్టు 16న ‘హలో లోకేష్’ పేరుతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి గుంటూరు, విజయవాడ నుంచి విద్యార్థులు, యువత తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ జవాబు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక యువతి నారా లోకేష్ ను బ్రాహ్మణితో పెళ్లి విషయం గురించి కూడా అడిగింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్తూ, నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో లవ్ స్టోరీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వారిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని.. అయితే ‘ముద్దుల మామయ్య దగ్గర అంత సాహసం చేసేవాడ్ని కాదని వెల్లడించారు.
ఇంట్లో అమ్మానాన్నలు వెకేషన్ కు వెళ్తే అక్కడ చెప్పారట. పెళ్లి గురించి వారు అనుకుంటున్నారని తన అభిప్రాయం ఏంటని అడిగారు. నా అభిప్రాయం మీకు తెలుసు కదా. . అని తెలిపారట. బ్రాహ్మణి కూడా ఒప్పుకుంది. వివాహం జరగడం, ఆ తరువాత జరిగింది మీకు తెలిసిందే కదా” అంటూ చెప్పుకొచ్చారట. ప్రస్తుతం వీరి లవ్ స్టోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.