Kavitha Speech: కల్వకుంట్ల కవిత.. పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ ఉద్యమ సారథి.. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణకు పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేర్‌రావు ముద్దుల తనయ. తెలంగాణ జాగృతి పేరుతో బతుకమ్మ ఆడి స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపు తెచ్చారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తన స్వార్థం కోసం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని కేసీఆర్ కుటుంబం పరువును ఢిల్లీ వీధుల్లో తీసేశారు. తాజాగా తెలంగాణ శాసన మండలి వేదికగా కేసీఆర్ పరువు తీసి.. ఇలాంటి కూతురు కేసీఆర్ కడుపున ఎందుకు పుట్టింది అన్నట్లుగా విమర్శలు ఎదుర్కొంటునానరు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై అవినీతి ఆరోపణలు చేశారు.
పదేళ్ల పాలన అవినీతి మయంగా..
శాసన మండలి సమావేశంలో కవిత తండ్రి పాలనను అక్రమాల మాటగా చిత్రీకరించారు. దశాబ్ద పాలన మొత్తం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిదన్నారు. తెలంగాణ ద్రోహులకు బీఆర్‌ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. ఉద్యమకారులను అవమానించిందని పేర్కొన్నారు. అయితే కవిత వ్యాఖ్యలను కుటుంబ ద్రోహంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పదేళ్లలో ఆదర్శంగా తెలంగాణ..
పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలపారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఉమ్మడి రాష్ట్రంలో చేయలేని పనులను పదేళ్లలో పూర్తి చేశారు. జీడీపీలోలో దేశ అగ్రస్థానంలో నిలిపారు. వరి ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానంలో నిలిపారు. కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు పథకం దేశీయ మోడల్‌గా మారింది. దీంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుబంధు కిసాన్ సమ్మాన్ నిధికి స్ఫూర్తిగా నిలిచింది.
విద్యుత్ సమస్యను అధిగమించి..
ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అయితే అంధకారం అవుతుందని, బిహార్‌లా మారుతుందని, అవినీతి పెరుగుతుందని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కానీ కేసీఆర్ విద్యుత్సమస్యను అధిగమించారు. రెప్ప పాటు కూడా కరెంటు కోత లేకుండా చేశారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందించారు.
విశ్వనగరంగా హైదరాబాద్…
ఇక మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు, వైఎస్.రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. దానికి కొనసాగింపుగా కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసి విశ్వనగరంగా గుర్తింపు తెచ్చారు. పెట్టుబడులకు కేంద్రంగా మార్చారు.
60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని భుజానికి ఎత్తుకున్న కేసీఆర్.. ఉమ్మడి రాష్ట్ర నేతలు, సమైక్య వాదులతోనూ జై తెలంగాణ అనిపించారు. స్వరాష్ట్రం కోసం సామదాన దండోపాయాలు ఉపయోగించారు. సబ్బండ వర్ణాలను ఏకం చేసి స్వరాష్ట్రం సాధించారు. పదేళ్లు ఎంతో అభివృద్ధి చేశారు. కానీ కవిత ఏమీ చేయలేదని విమర్శిస్తున్నారు. అభివృద్ధిని దగ్గర ఉండి చూసిన కవిత కన్న తండ్రి పరువు తీయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.