Mahindra XUV 3XO : ప్రపంచవ్యాప్తంగానే కాదు, భారతదేశంలో కూడా ఇప్పుడు SUVల డిమాండ్ పెరుగుతోంది. ఇదే కారణంతో ప్రతి కార్ల తయారీ సంస్థ తమ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ SUVలను చేర్చుతోంది. మహీంద్రా కేవలం SUVలను మాత్రమే తయారు చేసి విక్రయిస్తుంది. కంపెనీ లైనప్‌లో ఒకదానికొకటి అద్భుతమైన కార్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఖరీదైనవి కూడా ఉన్నాయి. అయితే, మహీంద్రా విడుదల చేసిన చౌకైన SUV మాత్రం కంపెనీకి గేమ్ ఛేంజర్‌గా నిరూపితమైంది. ఈ SUVనే మహీంద్రా XUV 3XO.
మహీంద్రా XUV 3XOను ఏప్రిల్ 2024లో XUV300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా విడుదల చేసింది. మహీంద్రా పోర్ట్‌ఫోలియోలోని అత్యంత చౌకైన SUV ఇది. ప్రజలకు ఇది ఎంతగానో నచ్చింది. ఫలితంగా ఏడాదిలోనే దీని అమ్మకాలు దాదాపు రెండింతలు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం 2025లో మొత్తం 1,00,905 మంది ఈ XUV 3XOని కొనుగోలు చేశారు. ఇదే సంఖ్య ఆర్థిక సంవత్సరం 2024లో 54,726 యూనిట్లుగా ఉంది. ఇది దాదాపు 84 శాతం వృద్ధిని సూచిస్తుంది. లక్షకు పైగా అమ్మకాలతో XUV 3XO దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 SUVల జాబితాలో చేరిపోయింది. ఈ జాబితాలో మహీంద్రాకు చెందిన మరో SUV థార్ కూడా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 47,000 మంది థార్‌ను కొనుగోలు చేశారు. అయితే, థార్ అమ్మకాలు ఆర్థిక సంవత్సరం 2024తో పోలిస్తే 28 శాతం క్షీణించాయి.
Also Read : చిన్న కుటుంబానికి బెస్ట్ ఆప్షన్.. మహీంద్రా XUV 3XO స్పెషాలిటీ ఇదే!
XUV 3XO డిజైన్
మహీంద్రా XUV 3XO అనేది పాపులర్ మోడల XUV300 కొత్త వెర్షన్. దీని డిజైన్ ఇతర సబ్-కాంపాక్ట్ SUVల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది బోల్డ్ ఎక్స్‌టీరియర్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, ఇది మోడ్రన్, హై-క్వాలిటీ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. అనేక అత్యాధునిక ఫీచర్లతో నిండి ఉంది. తక్కువ బడ్జెట్‌లో సురక్షితమైన ఫ్యామిలీ కారు కోసం చూస్తున్న వారికి 3XO ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
XUV 3XO ధర
మహీంద్రా XUV 3XO ధర రూ.7.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ. 15.56 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం 25 వేరియంట్లలో అందుబాటులో ఉంది. XUV 3XO బేస్ మోడల్ MX1 కాగా, టాప్ మోడల్ మహీంద్రా XUV 3XO AX7 L టర్బో AT. ఈ ధరల శ్రేణిలో టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి అనేక ఆఫ్షన్లు కూడా ఉన్నాయి. అయితే, అమ్మకాల పరంగా అవి చాలా ముందు ఉన్నాయి.
XUV 3XO మైలేజ్
XUV 3XO ఒక 5 సీటర్, 3 సిలిండర్ల కారు. దీని పొడవు 3990 మిమీ, వెడల్పు 1821 మిమీ, వీల్‌బేస్ 2600 మిమీ. మహీంద్రా XUV 3XO మైలేజ్ లీటరుకు 18.06 నుండి 21.2కిమీ వరకు ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 18.06 నుండి 19.34కిమీ వరకు ఉండగా, డీజిల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 20.6 నుం
Also Read : కలలో కూడా ఈ ఆఫర్ ఊహించలేం.. మహీంద్రా ఆ మోడల్ పై రూ.1.15లక్షలు ఆదా