Pawan Kalyan And Rajinikanth: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ రజినీకాంత్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటికి క్రేజ్ సంపాదించుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్… ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న నటుడు రజనీకాంత్ ఈయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసేలా తను వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు.
ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ రజనీకాంత్ ఇద్దరు కూడా కొంతమంది దర్శకులను నమ్మి రెండుసార్లు వాళ్లకి అవకాశాలు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఫ్లాప్ సినిమాలనే తీశారు. ఇక వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము…
రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘కబాలి ‘ సినిమా టీజర్ తో ప్రేక్షకులందరిని మెప్పించింది. అయినప్పటికీ ఈ సక్సెస్ మాత్రం సక్సెస్ సాధించలేదు. ఇక ఈ సినిమాకి పా రంజిత్ దర్శకుడుగా వ్యవహరించాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇంక దాంతో పాటుగా రజనీకాంత్ తన ఎంటైర్ కెరియర్ లోనే ఈ సినిమాలో చాలా నర్వస్ గా నటించాడు అనే విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పా రంజిత్ కి రజనీకాంత్ మరో సినిమా కాలా సినిమా చేసే అవకాశాన్ని అందించాడు. అయినప్పటికీ రంజిత్ మాత్రం ఈ సినిమాని కూడా సక్సెస్ చేయలేదు. దాంతో రజనీకాంత్ కి రెండు ఫ్లాప్ లను ఇచ్చిన డైరెక్టర్ గా పా రంజిత్ ఒక బ్యాడ్ నేమ్ ను అయితే సంపాదించుకున్నాడు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గోపాల గోపాల సినిమాని తీసిన డాలీ కూడా ఈ సినిమాతో సక్సెస్ ని అందివ్వలేకపోయాడు. ఇక ఈ సినిమా తో ఫెయిల్యూర్ వచ్చిన కూడా పవన్ కళ్యాణ్ మరోసారి డాలీ డైరెక్షన్ లో నటించాలనే ఉద్దేశ్యంతో కాటమరాయుడు సినిమాని చేసే అవకాశాన్ని తనకి ఇచ్చాడు. అయినప్పటికీ ఆ సినిమాని కూడా సక్సెస్ చేయడంలో డాలీ ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి. ఇలా రజనీకాంత్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇలా డైరెక్టర్లను నమ్మి రెండుసార్లు మోసపోయారనే చెప్పాలి…