https://oktelugu.com/

Allaneredu: అల్లనేరేడు సాగుతో లక్షల్లో సంపాదించే ఛాన్స్.. తక్కువ పెట్టుబడితో?

Allaneredu: దేశంలో వ్యవసాయం చేసే రైతులకు ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఖర్చులు పెరగడం వల్ల రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు. అయితే అల్లనేరేడు (Allaneredu) సాగు చేయడం ద్వారా రైతులు భారీ మొత్తంలో ఆదాయం (Income) పొందే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ పెట్టుబడితో అన్నిరకాల వాతావరణ పరిస్ధితులలో ఈ పంటను పండించవచ్చు. తక్కువ నీటి వనరులతో ఈ పంటను పండించవచ్చు. ప్రకాశం జిల్లాలోని తిప్పాయ పాలెంకు చెందిన రైతు కందురు వెంకట్ రెడ్డి 30 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 23, 2021 / 05:59 PM IST
    Follow us on

    Allaneredu: దేశంలో వ్యవసాయం చేసే రైతులకు ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఖర్చులు పెరగడం వల్ల రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు. అయితే అల్లనేరేడు (Allaneredu) సాగు చేయడం ద్వారా రైతులు భారీ మొత్తంలో ఆదాయం (Income) పొందే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ పెట్టుబడితో అన్నిరకాల వాతావరణ పరిస్ధితులలో ఈ పంటను పండించవచ్చు. తక్కువ నీటి వనరులతో ఈ పంటను పండించవచ్చు.

    ప్రకాశం జిల్లాలోని తిప్పాయ పాలెంకు చెందిన రైతు కందురు వెంకట్ రెడ్డి 30 ఎకరాల్లో అల్లనేరేడు పంటను సాగు చేస్తున్నారు. చింతామణి2 వెరైటీ రకం మొక్కలను తెచ్చి వెంకట్ రెడ్డి పొలంలో పంట సాగును చేపట్టారు. ఈ పంటకు చీడపీడల బెడద ఉండదు కాబట్టి పురుగుమందుల కొరకు డబ్బులను ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. మొక్క నాటిన మూడు సంవత్సరాల తర్వాత పంట చేతికి వస్తుంది.

    కషాయాల ద్వారానే సులభంగా చీడపీడలను సులభంగా నివారించుకోవచ్చు. ఒక్కో చెట్టుకు 70 కిలోల నేరేడు పళ్ళ దిగుబడి వస్తుందని సమాచారం. ఈ పండ్లు కిలో 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పలుకుతాయి. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఈ మొక్కల ద్వారా దీర్ఘకాలిక అదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

    ఒకవేళ పండ్లకు డిమాండ్ లేకపోతే గుజ్జును ఇంట్లో నిల్వ చేసి ఆ గుజ్జును అమ్ముకునే అవకాశం ఉంటుంది.ఈ మొక్కలు ఎండిపోయే అవకాశాలే ఉండవని సమాచారం. సేంద్రీయపద్దతిలో అల్లనేరేడు సాగు చేయడం ద్వారా నికర రాబడిని పొందే అవకాశాలు ఉంటాయి.