PF subscribers : దేశంలో కోట్ల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పని చేసే ఉద్యోగులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ ఉద్యోగులలో చాలామంది పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. అయితే పీఎఫ్(PF) ఖాతాదారులు(Subscribers) కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చడం కోసం పీఎఫ్, పెన్షన్ తో పాటు జీవిత బీమా ప్రయోజనాలను కూడా అందిస్తుండటం గమనార్హం. జీవిత బీమా ప్రయోజనాల కింద ఈ సంస్థ రూ.7 లక్షల ఉచిత జీవిత బీమా రక్షణ పొందవచ్చు.
పీఎఫ్ ఖాతాదారులు ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే ఈ బీమా ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ బెనిఫిట్స్ ను పొందాలని అనుకునే వాళ్లు ఒక ఫారమ్ ను ఖచ్చితంగా నింపాలి. ఫారమ్ ను నింపని పక్షంలో స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందడానికి అర్హత పొందలేరు. రిటైర్మెంట్ ఫండ్ బాడీ తాజాగా ఈ ఫారమ్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఖాతాదారుని కుటుంబంకు సామాజిక భద్రత కలిగే విధంగా ఇ-నామినేషన్ దాఖలు చేయాలని పీఎఫ్ ఖాతాదారులకు సూచనలు చేసింది. ఈపీఎఫ్ఓ సంస్థ 1952 చట్టం కింద సామాజిక భద్రత ప్రయోజనాలను పొందవచ్చు. https://www.epfindia.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఇ-నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వెన్ సైట్ లోని సేవలను ఎంపిక చేసుకుని ఆన్‌లైన్ సర్వీస్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మేనేజ్ ట్యాబ్ లో ఇ-నామినేషన్‌ను ఎంచుకుని ప్రొవైడ్ వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత కుటుంబ వివరాలను తెలిపే ఆప్షన్ పై క్లిక్ చేసి ఓటీపీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈపీఎఫ్ఓలో వివరాలను నమోదు చేయవచ్చు.