Homeబిజినెస్Lost Car Key : కారు Key పోయిందా? రూ.100తో సేఫ్ గా ఉండొచ్చు....

Lost Car Key : కారు Key పోయిందా? రూ.100తో సేఫ్ గా ఉండొచ్చు. ఎలాగంటే? 

Lost Car Key : నేటి కాలంలో కారు కొనడం పెద్ద విషయం కాదు. కానీ దానిని మెయింటేన్ చేయడమే అసలైన పని. కారులో ఫ్యూయెల్ నుంచి పార్ట్స్ వరకు అన్నీ చెక్ చేసుకోవడమే కాకుండా ఎప్పడూ కారుకు సంబంధించిన పరికరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కారు కీ పోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా మంది కారు  Key పోయినప్పుడు డూబ్లికేట్  Key ని తయారు చేసుకుంటారు. లేదా అందకుముందు ఉన్న మరో కీతో కారును నడుపుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఎంత పెద్ద డేంజరో తెలిస్తే షాక్ అవుతారు. డూబ్లికేట్ కీ తో మీరు మీ కారు నడుపుతున్నప్పుడు అసలైన కీ దొంగవద్ద ఉన్నట్లే కదా? అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే రూ.100 మాత్రమే ఖర్చుపెట్టండి.. అందుకు సంబంధించిన వివరాలేంటో చూద్దాం..
కారును కొనుగోలు చేసేటప్పుడు షోరూం ప్రతినిధులు మనకు కొన్ని సూచలను ఇస్తూ ఉంటారు. కానీ మనం వాటిని పట్టించుకోం. ముఖ్యంగా కారు ఇన్సూరెన్స్ చేసుకోవాలని కొందరు ఒత్తిడి చేస్తారు. అప్పటి వరకు ఇన్సూరెన్స్ చేస్తాం. కానీ ఆ తరువాత నిర్లక్ష్యం చేస్తాం. అయితే కారుకు ఇన్సూరెన్స్ చేయాలంటే ఇబ్బందిపడినప్పుడు కారు Key కి ఇన్సూరెన్ష్ చేయమంటే ఊరుకుంటారా? అవును కారు Key కి కూడా ఇన్సూరెన్స్ ఉంది. అయితే ఈ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టాలి అంటే?
కారు ఫస్ట్ Key ని ఎవరైనా దొంగిలించినప్పుడు దాని డూబ్లికేట్ కీని ఎక్కడో రోడ్డు పక్కన షాపులో తయారు చేయించుకుంటారు. ఇలా చేయడం వల్ల రూ.200 వరకు ఖర్చు అవుతుంది కావచ్చు. కానీ దీనిని మేకింగ్ చేసేవాళ్ల దగ్గర లాక్ సిస్టమ్ కాపీ అవుతుంది. దీంతో వారు మరో కీ ని తయారు చేసుకునే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే కారు లాకింగ్ సిస్టమ్ మొత్తం మార్చేయాలి. అలా మార్చాలంటే రూ.25000 వరకు ఖర్చవుతుంది. ఇదంతా ఎందుకని స్ట్రీట్ వెండర్ దగ్గర కీ చేయించుకున్నారని అనుకుందాం.. ఈ కీతో మీరు కారు నడిపినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే.. కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. ఈ సమయంలో డబ్లికేట్ కీ ఉందంటే వారు యాక్సెప్ట్ చేయరు. కచ్చితంగా మెయిన్ కీ కావాలని అడుగుతారు. అందువల్ల రూ.25000 పెట్టి కొత్త లాక్ సిస్టమ్ అమర్చుకోక తప్పదు.
ఈ బాధ రాకుండా ఉండాలంటే కారు Key కి కూడా ముందుగానే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇలా ఇన్సూరెన్ష్ చేయడం వల్ల ఏడాదికి రూ.100 నుంచి రూ.300 మాత్రమే ఖర్చవుతుంది. ఇలా చేయడం వల్ల మీ కారు కీ పోయినా మీకు లాక్ సిస్టమ్ ను ఉచితంగానే అందిస్తారు. దీతో మీ కారును సేఫ్ గా దొంగల నుంచి తప్పించుకోవచ్చు. చాలా మంది చిన్న చిన్న ఖర్చులకు భయపడుతుందారు. కానీ సమస్య వచ్చినప్పుడు వృథా ఖర్చుకు వెనుకాడరు. అందువల్ల ముందు జాగ్రత్తగా కారు Key  ఇన్సూరెన్ష్ కూడా తీసుకోండి. పూర్తి వివరాలకు కారు షోరూంలో సంప్రదించండి.
S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper