https://oktelugu.com/

Intinti Gruhalakshmi Serial: అక్షరతో పెళ్లికి ఒప్పుకున్న ప్రేమ్.. శృతి వెనకాల నందు ఉన్న విషయం తెలుసుకున్న తులసి!

Intinti Gruhalakshmi Serial: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింట గృహలక్ష్మి సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ నేపథ్యం కథతో సాగుతున్న ఈ సీరియల్ లో ఒక గృహిణి తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటుందో ఆ కుటుంబం నుండి ఎటువంటి నిందలు ఎదుర్కొంటుందో కథతో ప్రసారమవుతుంది. తులసిని కలసిన జీకే తనను పొగుడుతాడు. తన ధైర్యాన్ని చూసి మెచ్చుకుంటాడు. కేసు వాపసు తీసుకుంటాను అని చెప్పడంతో తులసి సంతోషపడుతుంది. ఇక జీకే అక్కడి నుంచి వెళ్లే సమయంలో […]

Written By: , Updated On : September 21, 2021 / 11:19 AM IST
Follow us on

Intinti Gruhalakshmi Serial: Pream Agreed To Marry Akshara

Intinti Gruhalakshmi Serial: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింట గృహలక్ష్మి సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ నేపథ్యం కథతో సాగుతున్న ఈ సీరియల్ లో ఒక గృహిణి తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటుందో ఆ కుటుంబం నుండి ఎటువంటి నిందలు ఎదుర్కొంటుందో కథతో ప్రసారమవుతుంది. తులసిని కలసిన జీకే తనను పొగుడుతాడు. తన ధైర్యాన్ని చూసి మెచ్చుకుంటాడు. కేసు వాపసు తీసుకుంటాను అని చెప్పడంతో తులసి సంతోషపడుతుంది. ఇక జీకే అక్కడి నుంచి వెళ్లే సమయంలో పక్కనే ఉన్న ఉద్యోగస్తుడు ఆమె ఎవరో కాదు అక్షర ప్రేమిస్తున్న ప్రేమ్ వాళ్ల అమ్మ అని చెప్పేసరికి వెంటనే జీకే మరింత సంతోషపడుతూ ఆమెను తన ఇంటికి ఆహ్వానిస్తాడు.

మీలాంటి ధైర్యం ఉన్న స్త్రీలను చూసి నా కూతురు మరింత నేర్చుకోవాలి అంటూ తులసిని ఇంటికి తీసుకెళ్తాడు. మరోవైపు లాస్య, భాగ్యం కూర్చొని మాట్లాడుకుంటారు. ఎలాగైనా ప్రేమ్ ను పెళ్లికి ఒప్పించాలని ప్లాన్ చేయగా శృతి తోనే ప్రేమ్ ను పెళ్లికి ఒప్పించవచ్చని భాగ్యం సలహా ఇస్తుంది. ఇక లాస్య కూడా ఈ ప్లాన్ ఎలాగైనా ఓకే చేయాలి అని అనుకుంటుంది. మరోవైపు తులసి జీకే వాళ్ళ ఇంట్లో ఉండగా.. ఇంతకీ ఎందుకు పిలిచారు అని తులసి అడుగుతుంది. ఇక జీకే నా కూతురు ని పరిచయం చేసే ముందు తన గురించి కొన్ని విషయాలు చెబుతాను అని వివరిస్తాడు.

ఇంతకు నేను ఎవరో కాదు నా కూతుర్ని మీ ఇంటి కోడలిగా చేసుకుంటానని నందు మాట ఇచ్చిన అక్షర తండ్రి అని చెప్పేసరికి వెంటనే తులసికి కోపం వస్తుంది. అంటే నీ కూతురు పెళ్లిని ఈ మార్గం ద్వారా ఒప్పించాలని ఇంటికి పిలిచారా అంటూ కాస్త వ్యతిరేకంగానే మాట్లాడుతుంది తులసి. అయినా ప్రేమ్ మనసులో తెలుసుకోకుండా ఎలా పెళ్లికి ఒప్పుకుంటారు అని ప్రశ్నిస్తుంది. వెంటనే జీకే మీలాంటి తల్లి ఉంటే ఆ కొడుకు ఎలా ఉంటాడో అందరికీ అర్థం అవుతుందని.. ఒక్కసారి నా కూతురు ని చూడండి అంటూ అక్షర రూమ్ లోకి పంపిస్తాడు.

ఇక తులసి అక్షర రూమ్ ను చూసి షాక్ అవుతుంది. ఆ గదిలో ఉన్న ప్రేమ్ ఫోటోలను చూసి ఏం మాట్లాడ లేక పోతుంది. అక్షర కు ప్రేమ్ పై ఉన్న ప్రేమ చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఇక జీకే తన కూతురు మనసు నిండా ప్రేమ్ ఉన్నాడని ఆ ప్రేమ వివరించలేనిది అంటూ చెప్పగా తులసి మాత్రం పెళ్లికి ఆసక్తి చూపనట్లు మాట్లాడుతుంది. తరువాయి భాగంలో శృతి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు కనిపించగా అందరి ముందు ప్రేమ్ అక్షరతో పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక నందు శృతి తో ప్రేమ్ మనసు మారకుండా ఉండాలంటే ఈ పెళ్లి అయ్యేవరకు ఎక్కడికి వెళ్ళకు అనేసరికి తులసికి మొత్తం నిజం తెలిసిపోతుంది.