Kia Sonet: భారతీయ SUV మార్కెట్‌లో కియా సోనెట్ మరోసారి తన తన సత్తా చాటింది. కేవలం చూడటానికి మాత్రమే కాకుండా పర్ఫామెన్స్, ఫీచర్ల పరంగా కూడా తానే నంబర్ వన్ అని నిరూపించుకుంది. కియా ఇండియా ఏప్రిల్ 2025లో మొత్తం 23,623 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఇది గతేడాది ఏప్రిల్ అమ్మకాల (19,968 యూనిట్లు) కంటే 18.3శాతం ఎక్కువ. ఈ వృద్ధిలో కియా సోనెట్ అత్యధికంగా 8,068 యూనిట్ల అమ్మకాలతో కీలక పాత్ర పోషించింది. దీంతో కియా బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా సోనెట్ నిలిచింది.
Also Read: పాత ఫోన్‌కు కొత్త లైఫ్.. సీసీటీవీ, మ్యూజిక్ ప్లేయర్, లెర్నింగ్ టూల్‌గా మార్చేయండి!
కియా సోనెట్‌లోని ప్రీమియం ఫీచర్లు
మీ ఫ్యామిలీ కోసం స్టైల్, టెక్నాలజీ, సేఫ్టీ కలిగిన ఎస్ యూవీ కోసం చూస్తున్నారా.. అయితే కియా సోనెట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-ఇంచుల కంప్లట్ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఉన్నాయి. ఇది ప్రీమియం ఇంటీరియర్ అనుభవాన్ని అందిస్తుంది. సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 7 స్పీకర్లతో కూడిన బోస్ సౌండ్ సిస్టమ్ దీని లగ్జరీ అనుభూతిని మరింత పెంచుతాయి. అలాగే, ఇందులో కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, క్రూజ్ కంట్రోల్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇది కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో కూడా వస్తుంది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభంగా నియంత్రించవచ్చు.
సేఫ్టీ ఫీచర్స్
సేఫ్టీ విషయానికి వస్తే.. కియా సోనెట్ అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తుంది. ఇది చాలా సురక్షితమైనదిగా భావించవచ్చు. దీనితో పాటు ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, లెవెల్ 1 ADAS వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ అన్ని సౌకర్యాలతో కియా సోనెట్ కేవలం స్టైలిష్‌గానే కాకుండా సేఫ్టీ టెక్-సావీ SUVగా కూడా నిలుస్తుంది.
ఇంజిన్, మైలేజ్
కియా సోనెట్‌లో మూడు రకాల ఇంజిన్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజిన్ ఆప్షన్ వల్ల ఈ SUV వివిధ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ లీటరుకు 19.2 కిలోమీటర్ల వరకు, డీజిల్ వేరియంట్ లీటరుకు 22.3 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ SUV తన తరగతిలో మంచి మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది లాంగ్ డ్రైవ్‌లు, డైలీ యూజ్ రెండింటికీ సరిపోతుంది.
కియా సోనెట్‌ను HTE, HTK, HTK+, HTX+, GTX, X-Line వంటి వేరియంట్‌లలో విడుదల చేశారు. మొత్తం 18 వేరియంట్‌లతో ఈ SUV చాలా రకాల ఆప్షన్లను అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.8 లక్షలు (ఎక్స్-షోరూమ్), అయితే టాప్ వేరియంట్ ధర రూ.15.60 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ ధరల శ్రేణితో ఈ కారు ప్రతి బడ్జెట్‌లోని కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది.
కియా సోనెట్ నేరుగా మారుతి ఫ్రాంక్స్, హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్ వంటి ప్రముఖ కాంపాక్ట్ SUVలతో పోటీపడుతుంది. అయితే కియా సోనెట్ తన ఫీచర్లు, సేఫ్టీ పరికరాలు, ఇంజిన్ ఆప్షన్లు బడ్జెట్ ధర కారణంగా తన సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలుస్తుంది. అందుకే ఈ SUV భారతీయ వినియోగదారుల ఫస్ట్ ఆప్షన్ గా మారుతోంది.
Also Read:పాత ఫోన్‌కు కొత్త లైఫ్.. సీసీటీవీ, మ్యూజిక్ ప్లేయర్, లెర్నింగ్ టూల్‌గా మార్చేయండి!