Tata Altroz : ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కారు అప్ గ్రేడ్ వచ్చేసింది. ఈ నెలలోనే రిలీజ్ కానున్న ఈ కారు మొదటి లుక్ బయటకు వచ్చింది. మారుతి బాలెనో, స్విఫ్ట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సరికొత్తగా తీసుకొస్తోంది. ఈ కొత్త కారులో ఇంతకీ ఏం స్పెషాలిటీలు ఉన్నాయి. కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తున్నాయి.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ టీజర్ అనేక విధాలుగా స్పెషల్ గా నిలిచింది. ఇది మే 22న విడుదల కానుంది. జనవరి 2020లో మొదటిసారి విడుదలైన ఈ కారులో అప్పటి నుంచి పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఇప్పుడు వస్తున్న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ టీజర్‌లో చాలా కాస్మెటిక్ మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త టాటా ఆల్ట్రోజ్‌లో కంపెనీ చాలా అప్‌డేట్‌లు చేసింది. ఇవి మార్కెట్‌లో నిజంగా ‘దుమ్ము’ రేపుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో సరికొత్త డిజైన్‌తో కూడిన 3-డీ గ్రిల్ అందించారు. కారు హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లకు అదిరిపోయే అప్‌గ్రేడ్ ఇచ్చారు. హెడ్‌ల్యాంప్, డీఆర్‌ఎల్‌లను కళ్లు, కనుబొమ్మల ఆకారంలో డిజైన్ చేశారు. ఈ కారు బంపర్‌ను అప్‌డేట్ చేశారు.. అలాగే కారుకు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు.. ఇవి కారుకు ప్రీమియం లుక్ అందిస్తున్నాయి.
Also Read : పిచ్చెక్కించే ఫీచర్స్‌తో మారుతి మోడల్.. టెన్షన్లో టాటా, హ్యుందాయ్
కంపెనీ ఇప్పుడే దీని మొదటి టీజర్‌ను మాత్రమే విడుదల చేసింది. ఇందులో ఎక్కువగా కారు ఎక్స్‌టీరియర్ అప్‌డేట్‌లను మాత్రమే చూపించారు. టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ గురించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Just a glimpse is all it takes to turn heads and illuminate your world infinitely.
Something special is coming your way.
Visit https://t.co/HyER3OSDi5 to register your interest! #AllNewAltroz #AllNewTataAltroz #TataAltroz2025 #NewAltroz2025 #TataAltroz pic.twitter.com/Wby2y2BcqW
— Tata Motors Cars (@TataMotors_Cars) May 2, 2025
ప్రస్తుతం టాటా ఆల్ట్రోజ్ దేశంలో 5 పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లలో రాబోతుంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో దీనితో పాటు కారు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటో గేర్ బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 88 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఒక పవర్‌ట్రెయిన్ ఆప్షన్ 2-సీఎన్‌జీ సిలిండర్‌తో వస్తుంది. సీఎన్‌జీ వెర్షన్‌లో ఈ కారు 73.5 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే మాన్యువల్, ఆటో ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. ఈ ఇంజన్ 90 హెచ్‌పి పవర్ వరకు ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు రేసర్ వెర్షన్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో ఈ వెర్షన్ 120 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రారంభ ధర 10 లక్షల రూపాయల లోపు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read : ఏప్రిల్ 1నుంచి కార్ల ధరలు పెరగుతుంటే.. ఈ 7సీటర్ మాత్రం భారీగా తగ్గింది