Photo Story: చాలామంది సీరియల్ నటులు మరియు యాంకర్లు సినిమాలలో కూడా రాణించి సక్సెస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు చాలా నుంచి బుల్లితెర నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటి కూడా ఒకరు. ఒకప్పుడు ఈమె తన అందంతో, యాంకరింగ్ స్టైల్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంది. తన మాటల చాతుర్యంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.
Also Read: నితిన్ హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా
సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది సెలబ్రిటీల రేర్ ఫోటోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో ల వరకు అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఒక సెలబ్రిటీకి చెందిన రేర్ ఫోటో సామాజిక మాధ్యమాలలో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. వైరల్ అవుతున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది ఒకప్పుడు టెలివిజన్ ను ఏలింది. యాంకర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు. యాంకర్ గా బుల్లి తెర మీద స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అలాగే ఈమె కొన్ని సినిమాలలో కూడా నటించింది. ఈ మెసేజ్ మీద యాంకర్ గా కనిపిస్తే ప్రేక్షకులకు తెలియని ఆనందం అలాగే కుర్రాళ్లకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది. సినిమాలో హీరోయిన్లు మాత్రమే కాదు యాంకర్లు కూడా తమ అందంతో, మాటల చాతుర్యంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం బుల్లితెర మీద ఎన్నో ఏళ్ల నుంచి సక్సెస్ఫుల్గా రాణిస్తున్న స్టార్ యాంకర్ ఎవరు అంటే ముందుగా అందరూ చెప్పే పేరు సుమా కనకాల.
అలాగే అనసూయ, రష్మీ కూడా యాంకర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఒకప్పుడు అతిలోక సుందరి పేరు తెచ్చుకున్న యాంకర్ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఆమె ఉదయభాను. ఈమెను ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు. ఒకప్పుడు ఈమె తన అందంతో, చలాకీతనంతో బుల్లితెర మీద ఎన్నో షోలలో యాంకర్ గా చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఉదయభాను హృదయాంజలి అనే కార్యక్రమంతో బాగా ఫేమస్ అయింది. తను యాంకర్ గా స్టార్ట్ చేసిన మొదటి షో తోనే గలగల మాట్లాడుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.
యాంకర్ గా బాగా ఫేమస్ అయిన ఉదయభాను పలు సినిమా ఈవెంట్స్ కు కూడా యాంకర్ గా వ్యవహరించి బాగా పాపులర్ అయింది. బుల్లితెర మీద ప్రసారమయ్యే వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింభక, డాన్స్ బేబీ డాన్స్, రేలారే రేలా, డి రియాలిటీ డాన్స్ షో, జానవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా పలు టీవీ షోస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. యాంకర్ గానే కాకుండా సినిమాలలో కూడా తన సత్తా చూపించింది. ఉదయభాను పదవ తరగతి చదువుతున్న సమయంలో ఎర్రసైన్యం అనే సినిమాలో చేసే అవకాశాన్ని అందుకుంది. తెలివితో పాటు ఈమె తమిళ్, కన్నడ సినిమాలలో కూడా నటించింది. ఉదయభాను పెళ్లి తర్వాత బుల్లితెర మీద కనిపించలేదు. ప్రస్తుతం ఈమె త్రిపాణధారి బార్బెరిక్ అనే సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.