RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇక బ్యాంకు కస్టమర్లకు పండగే

ఆర్థిక వ్యవస్థలోని కొన్ని విభాగాల్లో ఒత్తిళ్లు ఉన్నా.. ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో సెంట్రల్‌ బ్యాంక్‌ వరుసగా ఏడోసారి రెపో రేటును 6.6% వద్ద మార్చకుండా కొనసాగించాలని భావిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : June 7, 2024 12:46 pm

RBI

Follow us on

RBI: బ్యాంకుల్లో ఫీక్స్‌డ్‌ డిపాజిట్లకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం ఎఫ్‌డీలపై వివిధ బ్యాంకులు మంచి వడ్డీ అందిస్తున్నాయి. ఇకపై కూడీ ఈ వడ్డీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ సమావేశం(ఎంపీసీ) జూన్‌ 7న జరుగనుంది. ఈ సమావేశంలో ఆర్బీఐ ఎఫ్‌డీ పెట్టుబడులకు ప్రస్తుత అనుకూల పరిస్థితులను కొనసాగిస్తూ, రెపో రేటును యథాతధంగా 6.5% వద్దే ఉంచుతుందని తెలుస్తోంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ప్రకటించనున్నారు.

ప్రస్తుత వడ్డీ రేటు కొనసాగింపు?
ఆర్థిక వ్యవస్థలోని కొన్ని విభాగాల్లో ఒత్తిళ్లు ఉన్నా.. ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో సెంట్రల్‌ బ్యాంక్‌ వరుసగా ఏడోసారి రెపో రేటును 6.6% వద్ద మార్చకుండా కొనసాగించాలని భావిస్తోంది. బలమైన ఆర్థిక వ్యవస్థ పనితీరు, జీడీపీ వృద్ధి 8%, లక్ష్యానికి మించి ద్రవ్యోల్బణం, ఫెడరల్‌ రిజర్వ్‌ డైరెక్ష¯Œ పై అనిశ్చితి కారణంగా ఆర్‌బీఐ ప్రస్తుత ఉన్న రెపోరేటే కొనసాగించే అవకాశం ఉందని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, సీనియర్‌ ఎకనామిస్ట్‌ రాధికారావు తెలిపారు.

జూలైలో బడ్జెట్‌..
ఆర్‌బీఐ పాలసీ ప్రివ్యూ రిపోర్ట్‌ ప్రకారం, కొత్త ప్రభుత్వం వచ్చే నెలలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భవిష్యత్తు ఆర్థిక విధానాలను ప్రభావితం చేసే కొత్త ప్రభుత్వ బడ్జెట్‌ కోసం ఆర్‌బీఐ కూడా వేచిచూస్తోంది. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు కూడా ఆర్‌బీఐ భవిష్యత్తు నిర్ణయాల్లో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ఎంపీసీ సమావేశంలో, వైఖరిలో ఎటువంటి మార్పు లేకుండా పాలసీ రేటును యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ భావిస్తోంది.