AP New Scheme: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఫస్ట్ ఇప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇప్రెషన్ అన్నట్లుగా తమ పాలన తీరు బాగుందనిపించుకునేందుకు కొత్త ప్రభుత్వం మహిళలను ఆకట్టుకునేందుకు కొత్త స్కీం ప్రారంభించాలని భావిస్తోంది. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయంచింది. ఏడాదికి రూ.18 వేలు అందనుంది.
మహిళలను ఆకట్టుకునేలా..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా టీడీపీ ఈ స్కీం మేనిఫెస్టోలో పెట్టింది. ఓటరు అయిన ప్రతీ మహిళకు నెలకు రూ.1,500 చొప్పున అందిస్తామని ప్రకటించింది. వీటితో ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, పప్పు, ఉప్పు లాంటివి తీసుకోవచ్చు. దీంతో ఇంటి ఖర్చుల భారం తగ్గుతుందని ఏపీ మహిళలు భావించారు. దీంతో మహిళలు ఎన్నికల్లో టీడీపీకి జైకొట్టారు.
అభివృద్ధి కూడా కావాలి..
ఇదిలా ఉంటే.. ఏపీలో సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి కూడా కావాలని ప్రజలు కోరుతున్నారు. జగన్ సర్కార్ కూడా అనేక సంక్షేమ పథకాలు అందించింది. కానీ, అభివృద్ధి కనిపించలేదు. ఈ క్రమంలోనే ఓటర్లు ఎన్నికల్లో ఆ పార్టీని తిరస్కరించారు. కొత్త ప్రభుత్వం కూడా అభివృద్ధిని వదిలేసి కేవలం సంక్షేమం తమ అజెండాగా ముందుకు వెళితే ప్రయోజనం ఉండదు, ఏపీ ప్రజలు దానిని స్వీకరించరు. ఇందుకు తాజా ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మరోవైపు రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు అయినా.. ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ఇది కూడా వైసీపీ ఓటమికి కారణం.
రాజధాని కావాలని..
కొత్త ప్రభుత్వం అయినా రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. అది చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మారు. అందుకే జగన్ సర్కార్‌ను సాగనంపారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకం కావడంతో ఈ పని కూడా సులువు అవుతుందని భావిస్తున్నారు.
మేనిఫెస్టోలో కీలక పథకాలు..
ఇదిలా ఉండగా టీడీపీ మేనిఫెస్టోలో కీలక పథకాలు ప్రకటించింది. మెగా డీఎస్సీ ఫైల్ పై మొదటి సంతకం, సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్, బీసీలకు 50 ఏల్లకే రూ.4 వేల పింఛన్, యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం వంటివి ఉన్నాయి.