Jupiter 110 CC: నేటి కాలంలో స్కూటర్ అవసరం తప్పనిసరిగా మారిపోయింది. పురుషులతోపాటు యువతులు, మహిళలు సైతం తమ అవసరాల కోసం అనుగుణంగా స్కూటర్ ను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒకప్పుడు కేవలం పెప్ట్ వంటి చిన్న స్కూటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతీ కంపెనీ యువతులు, మహిళల కోసం ప్రత్యేకంగా వాహనాలను తయారు చేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. వీటిలో TVS కంపెనీకి చెందిన Jupiter అనే వెహికల్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ఇది ప్రత్యేకంగా కళాశాల అమ్మాయిల కోసం తయారుచేసినట్టు కొందరు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా దీని ధర తక్కువ కావడంతో రెండో అవసరానికి ఈ స్కూటర్ కొనుగోలు చేయవచ్చని తెలుపుతున్నారు. మరి ఈ స్కూటర్ ఫీచర్స్, ఇంజన్ పనితీరు ఎలా ఉందంటే?
TVS కంపెనీ నుంచి మార్కెట్లోకి రాబోతున్న Jupiter 110 CC అనే స్కూటర్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఇది కూరగాయల కోసం లేదా ఇతర సామాగ్రి కొనుగోలు చేసే వారికి అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్కూటర్ సీట్ కింద 33 ఎల్ స్టోరేజ్ ని ఉంచారు. అలాగే హెల్మెట్ తో పాటు అవసరమైన వస్తువులను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. రద్దీగా ఉండే నగర ట్రాఫిక్ లో సులభంగా బయటపడేందుకు ఇది స్మార్ట్ గా మూవ్ అవుతుంది. అలాగే పార్కింగ్ చేయడానికి కూడా అనుగుణంగా డిజైన్ చేయబడింది. వర్షాకాలంలో సైతం దీనిపై పడే మరకలను నిరోధించడానికి ప్రత్యేకమైన లెదర్ సీట్స్ అమర్చారు. 106 కిలోల కెర్బ్ బరువు ఉన్న ఈ స్కూటర్ కు 12 అంగుళాల అలానే వీల్స్ ఉన్నాయి. ట్యూబ్ లెస్ రబ్బర్ గ్రిప్ ఉన్న టైర్లు చాలా స్మూత్ గా వెళ్తాయి. త్రీ స్టెప్ ప్రీ లోడ్ తో ఉన్న డబుల్ షాక్ లు స్పీడ్ బ్రేకర్ల పైనుంచి వెళ్లేటప్పుడు ఇబ్బంది అనిపించదు. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ రోల్ తోపాటు పొడవైన వీల్ బేస్ కలిగిన సీట్లు సౌకర్యాన్ని ఇస్తాయి.
టీవీఎస్ కొత్త జుపిటర్ స్కూటర్లో నేటి తరం వారికి అనుగుణంగా స్మార్ట్ ఫీచర్లు అమర్చారు. ఇందులో వేగాన్ని తెలిపే డిజిటల్ మీటర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఎస్ఎంఎస్ అలర్ట్, యాప్ ద్వారా క్రాస్ వార్నింగ్ వంటివి ఉన్నాయి. మొబైల్ ఛార్జింగ్ కోసం యూ ఎస్ బి పోర్ట్ సౌకర్యాన్ని అందిస్తాయి. అలాగే దీనికి ఉండే LED హెడ్ లాంప్స్ రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్ని సమయాల్లో ప్రకాశవంతమైన కాంతిని అందిస్తాయి. దీనికి ఉండే DRL లైట్స్ ద్వారా బ్రైట్నెస్ ను అందిస్తాయి. అయితే దీని టచ్ స్క్రీన్ గురించి వివరాలు అందించలేదు. కానీ వాయిస్ ఆశిస్తూ బ్లూటూత్ హెల్మెట్ ద్వారా ప్రయాణం సులభం చేస్తుంది.
ఈ స్కూటర్లో 113.3 సి సి ఎయిర్ కూల్డ్ ఇంజన్ ను అమర్చారు. ఇది లీటర్ ఇంధనానికి 55 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది.