Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… అప్పటి వరకు అలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారా? అనే డౌట్ అందరిలో ఉండేది. కానీ అర్జున్ రెడ్డి సినిమాతో పూర్తి బోల్డ్ సినిమాను తీసి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా అతనికి గొప్ప విజయాలు సాధించి పెట్టడమే కాకుండా తన మార్కును సైతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలాంటి దర్శకుడి నుంచి ప్రస్తుతం స్పిరిట్ అనే సినిమా వస్తుంది. ప్రభాస్ ని హీరోగా పెట్టి చేస్తున్న ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రభాస్ ఆటిట్యూడ్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుందట… ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి చెప్పాడు.
తనకు ఒక స్టైలిష్ డాన్ క్యారెక్టర్ లో ఉన్న హీరోని చూపించాలని అలాగే ఒక ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ గా ఉన్న హీరోతో అసాధ్యమైన పనులను చేయించాలి. అలాంటప్పుడే హీరోయిజం అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతుంది అంటూ ఆయన చెప్పాడు. మరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందనేది ఎవరు ఊహించుకొని కూడా ఉండరు.
మరి అలాంటి సందీప్ రెడ్డి వంగ రాబోయే సినిమాలతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఫుల్ ఫీల్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఫిజికల్ హ్యాండి క్యాపిడ్ గా కనిపిస్తాడు అంటే హీరోకి చేయి లేకుండా కనిపిస్తాడా? లేదంటే కాలు లేకుండా కనిపిస్తాడా? హీరో ఎలా కనిపించబోతున్నాడు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తన సినిమాలో నటించే హీరోని కూడా సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఈ సినిమాలో నటించే హీరో ఎవరు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం సందీప్ స్పిరిట్ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టాడు. 2027 వ సంవత్సరం మార్చి నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…